టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జల్సా సినిమాతో మొదలైన వీరిద్దరి స్నేహం ఇన్నేళ్లుగా కంటిన్యూగా కొనసాగుతూనే వస్తోంది. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ వీరిద్దరూ మంచి మిత్రులు అయిపోయారు వీరిద్దరి కాంబినేషన్లో జల్సా – అత్తారింటికి దారేది – అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి.
జల్సా – అత్తారింటికి దారేది సినిమాలు రెండు సూపర్ హిట్. ఇక వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ తాజా ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తే మా వారు, ఆయన కబుర్లలో మునిగిపోతారు. వారిద్దరు ఎక్కువగా తత్వశాస్త్రం, పురాణాల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ మాటలో పడి అసలు చుట్టూ ఏం ? జరుగుతుందన్న విషయం కూడా వీమీరు మర్చిపోతారు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం. మా వారు తన పుస్తకాలను ఎవ్వరికి ఇవ్వటానికి ఇష్టపడరు. అయితే కళ్యాణ్ గారు అడిగితే మాత్రం కాదనకుండా ఇచ్చేస్తారు. వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు ఏమైనా ఉన్నాయి అంటే అవి పుస్తకాలు, పెన్నులే అని సౌజన్య చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ గారికి మా ఇంటికి వంట అంటే చాలా ఇష్టం అని.. ఉదయం సమయంలో ఆయన మా ఇంటికి వస్తే ఉప్మా అడిగి మరీ చేయించుకుంటారు. మధ్యాహ్న భోజనం టైంకు వస్తే వెజిటేరియన్ వంటలు, ఆవకాయ ఇష్టంగా తింటారని చెప్పింది. ఇక ఊరగాయతో పాటు రవ్వలడ్డూలు అడిగి మరీ తింటారని.. ఆయన అడిగి మరీ తినే విషయంలో ఏ మాత్రం సిగ్గుపడరని చెప్పింది.
ఇక సౌజన్య శ్రీనివాస్ ఇటీవల నిర్మాతగా కూడా మారారు. ఆమమె బుట్టబొమ్మ, సార్ సినిమాలు కూడా నిర్మించారు. ఈ రెండు సినిమాల కథలు తానే స్వయంగా విని ఓకే చేసినట్టు ఆమె చెప్పారు.