సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనందరికీ బాగా తెలిసిన విషయమే . నార్మల్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ .. ప్రెసెంట్ పాన్ ఇండియా హీరోగా .. ఆ తర్వాత గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు . కాగా రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వరించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే .
ప్రజెంట్ ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ 31 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాడు . రెండు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్న సినిమాలు కావడం గమనార్హం. కాగా ఇలాంటి క్రమంలోనే తారక్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
గతంలో తారక్ – హీరోయిన్ సమీరా రెడ్డితో ప్రేమాయణం నడిపాడని.. వీళ్లిద్దరి మధ్య ప్రేమ పీక్స్ కి చేరి ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా పలు పత్రికల్లో వార్తలు ప్రచురించాయి. ఈ క్రమంలోనే తారక్ అలాంటిది ఏదీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు . అంతేకాదు నందమూరి కోడలు కాబోతున్న సమీరా రెడ్డి అంటూ వార్తలు రాసిన వారిపై కూడా మండిపడ్డారు. కాగా ఇప్పటికీ సోషల్ మీడియాలో అరా కొరా వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి .
ఈ క్రమంలోనే పెళ్ళి అయిపోయి.. ఇద్దరు పిల్లలున్న తనపై ఇలాంటి వార్తలు ఎలా రాస్తున్నారు అంటూ బాధపడుతున్నారట. అంతేకాదు ఇలా ఉన్నది లేనిది తన పై ప్రచారం చేస్తే వాళ్లకు ఒరిగేది ఏంది అంటూ బాధపడుతున్నారట . ఎన్నిసార్లు చెప్పినా పదేపదే అదే తప్పు చేస్తూ నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడిపోతున్నారట . దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కడానికి ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ చీప్ గా వార్తలు రాస్తున్నారు అంటూ కొన్ని పత్రికలపై మండిపడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక నైన కనికరం లేదా..ఇలాంటి చిల్లర వేషాలు మానుకోండి..అంటూ సజీషన్స్ ఇస్తున్నారు..!!