నందమూరి కుటుంబం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన వారసుల్లో బాలకృష్ణ, ఆయన సోదరుడు హరికృ ష్ణలు ముఖ్యంగా ప్రచారం పొందారు. నిజానికి నందమూరి కుటుంబం నుంచి త్రివిక్రమరావు(అన్నగారి సోదరుడు) కుమారుడు కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టారు. కానీ, ఆయన తొలి సినిమా సూపర్ హిట్ అయింది. అయితే, తర్వాత పెద్దగా నటించలేదని టాక్ ఇక, బాలయ్య, హరికృష్ణల విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న శ్రద్ధ త్రివిక్రమరావు తీసుకోలేదని అంటారు.
ఆయనే నందమూరి కళ్యాణ చక్రవర్తి. ఈయన త్రివిక్రమ రావు కుమారుడు. అంటే ఎన్టీఆర్ తమ్ముడి కుమారుడు. ఈయన 1980లలో తెలుగు చిత్రసీమలో కథానాయకునిగా వివిధ చిత్రాలలో నటించాడు. కొన్ని సినిమాలలో సహాయ నటునిగా కూడా నటించాడు. దాదాపు 10 చిత్రాలలో నటించాడు. ప్రతి సినిమా కూడా మంచి పేరు తెచ్చింది. కథ , కథనం ఎలా ఉన్నా.. కళ్యాణ్ చక్రవర్తి యాక్షన్‌కు మాత్ర పేరు రావడం గమనార్హం.
ముఖ్యంగా జీవిత రాజశేఖర్‌లు నటించిన తొలిసినిమా తలంబ్రాలు
లో నందమూరి కళ్యాణ చక్రవర్తి కూడా నటించారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చి..వరుసనే ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే.. హీరోగా ఛాన్స్ వచ్చే క్రమంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంటారు. నందమూరి కుటుంబంలోనే ఏర్పడిన పోటీ కారణంగా చక్రవర్తికి అవకాశాలు తగ్గాయని చెబుతారు. బాలయ్య లాంటి హీరో ముందు కళ్యాణ చక్రవర్తి ఆగలేకపోయారని టాక్ ఉంది.
ఇక, తన తండ్రి త్రివిక్రమరావు అనారోగ్యం కారణంగా ఆయనను చూసుకొనేందుకు కళ్యాణ్ తన సినీ జీవితాన్ని త్యాగం చేశారని ఇండస్ట్రీలో టాక్. ఏదేమైనా.. నందమూరి కుటుంబంలో అనేక మంది నటుల్లో కళ్యాణ్ చక్రవర్తి ఇలా వచ్చి అలా మెరిసి తెరమరుగైన దిగ్గజ నటుడు అనడంలో సందేహం లేదు. ఆయన నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ చెన్నైలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ అక్కడ బిజి అయ్యారు.