సాధారణంగా భార్యా భర్తలు విడాకులు తీసుకుంటే ఆ తరవాత భర్త భరణం ఇచ్చి ఆ బంధాన్ని పూర్తిగా తెంచేసుకుంటాడు. చాలా కేస్ లలో ఇలానే జరుగుతుంది. అప్పటికే తనకు పిల్లలు ఉన్నా కూడా భర్త ఆ కుటుంబాన్ని ఎంతోకొంత డబ్బులిచ్చి దూరం చేసుకుంటాడు. కానీ పిల్లల కోసం ఆలోచించి విడాకుల తరవాత కూడా వారిని పట్టించుకునే తండ్రులు చాలా అరుదు. అక్కినేని నాగార్జున కూడా అలాంటి గొప్పమనసు కలిగినవారే.
నాగార్జున మొదట దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ నాగచైతన్య పుట్టిన తరవాత కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. దానికి కారణం లక్ష్మి పెళ్లికి ముందు అమెరికాలో చదువుకున్నారట. ఇక ఆ సమయంలో రామానాయుడు ఇండియాకు పిలిపించి నాగార్జున తో పెళ్లి నిశ్చయించారు. అయితే పెళ్లి తరవాత కూడా లక్ష్మికి అమెరికా వెళ్లాలని అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని కోరికలు ఉండేవట.
మరోవైపు నాగార్జున అప్పుడప్పుడే సినిమాలలో రానిస్తున్నాడు. హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. దాంతో తాను అమెరికాకు రాలేనని నాగార్జున స్పష్టం చేశారట.ఇక చేసేది లేక ఇద్దరూ పెద్దలకు చెప్పి విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో నాగచైతన్య కెరీర్ నాశనం అవ్వకుండా ఉండాలని అతడిని హీరోను చేయాలని నాగ్ అనుకున్నారట. అంతేకాకుండా తన ఆస్తిలో అతడికి భాగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.
ఈ నేపథ్యంలోనే నాగచైతన్యను పూర్తిగా ఇవ్వకుండా తాను కూడా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారట. ఇక నాగచైతన్య చిన్నతనంలో ఎక్కువగా రామానాయుడు ఇంట్లో ఉండేవారట. సమ్మర్ లో సెలవులకు నాగార్జున వద్దకు వచ్చేవారట. అయితే అలా వచ్చినప్పుడు చైతూ తిరిగివెళుతుంటే నాగార్జున కన్నీళ్లు పెట్టుకునేవారట. ఎంతో ప్రేమ ఉండటం వల్లే నాగ్ చైతూను విడిచిపెట్టుకుండా ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ వెన్నంటే ఉంటున్నారు.