సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎలా పడి చచ్చిపోతూ ఉంటారో జనాలు మనందరికీ బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా ఆయన్ని ఒక హీరోగా కన్నా కూడా ఓ అన్నలా మన ఇంటి పెద్ద మనుషులా భావిస్తూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ స్దానాన్ని సంపాదించుకోవడం రేర్ అని చెప్పాలి . అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంపాదించుకుంటే ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు .
కేవలం జూనియర్ ఎన్టీఆర్ కాదు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి కూడా సోషల్ అభిమానుల్లో మంచి పేరును సంపాదించుకుంది . అందరి హీరోల భార్యల్లా చిట్టిపొట్టి బట్టలు వేసి ఫుల్ మేకప్ వేసుకొని సోషల్ మీడియాలో నానా హంగామా చేయకుండా.. పద్ధతిగా భర్త పేరు నిలబెడుతూ నందమూరి ఇంటి గౌరవాని మరింత పెంచుతుంది. సింప్లిసిటీకి మరో మారుపేరు అయిన లక్ష్మీ ప్రణతి రీసెంట్గా చార్మినార్ నైట్ బజార్లో షాపింగ్ చేసింది. అంత పెద్ద స్టార్ హీరో భార్య సింపుల్గా చార్మినార్ బజార్ లో షాపింగ్ చేయడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .
అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు . రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్ దగ్గర నైట్ బజార్ పెడతారన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే చాలా సింపుల్ గా చాలా స్టైలిష్ లుక్ లో చాలా హోం లీ లుక్స్ లో లక్ష్మీ ప్రణతి నైట్ బజార్ కి వచ్చి షాపింగ్ చేసింది . అంతే కాదు అక్కడ ఉన్న వారిని ఎవ్వరూ డిస్ట్రబ్ చేయకుండా ప్రశాంతంగా కూల్ గా తన షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయింది . మిగతా సెలబ్రిటీస్ అలా వస్తే ఎంత హంగామా చేస్తారో అందరికీ తెలిసిందే . ఇంత సింపుల్గా ఇంత హోమ్లీగా ఉన్న లక్ష్మీ ప్రణతిని చూసి ఎన్టీఆర్ అభిమానులు ఫీదా అవుతున్నారు . భార్యకు తగ్గ భర్త అంటూ పొగిడేస్తున్నారు..!!