Moviesఅబ్బబ్బా .. ఏం మెలిక పెట్టావయ్యా కొరటాల.. నందమూరి అభిమానులకు బిగ్...

అబ్బబ్బా .. ఏం మెలిక పెట్టావయ్యా కొరటాల.. నందమూరి అభిమానులకు బిగ్ టెన్షన్ స్టార్ట్..!!

ఏంటో.. ఈ కొరటాల తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు గానీ ..తెలిసి తెలియక చేసిన తనంతో కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతుంటే.. మరికొన్నిసార్లు ఫ్లాప్ అవుతున్నారు.. కెరియర్లో ఫ్లాప్ అన్న పదానికి మీనింగ్ తెలియని విధంగా దూసుకుపోయిన కొరటాలకు.. మొదటి ఫ్లాప్ రుచి చూపించింది ఆచార్య.. అఫ్కోర్స్ ఈ సినిమా డైరెక్షన్ సగం కొరటాల – సగం చిరంజీవి చేశాడన్న సంగతి అందరికీ తెలిసిందే .

ఈ క్రమంలోనే అప్పట్లో కొరటాలను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు.. డైరెక్టర్ నువ్వైతే ఆయన డైరెక్ట్ చేసేది ఏంటి అంటూ ఏకిపారేశారు . ప్రజెంట్ మళ్లీ అదే సిచువేషన్ క్రియేట్ చేసుకోబోతున్నాడు కొరటాల అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ కొరటాల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . ప్రెసెంట్ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది . అంతేకాదు 2024 ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసాడు కొరటాల శివ .

ఈ సినిమాకి సంబంధించిన పిక్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హైలెట్గా మారాయి . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మరో న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇన్నాళ్లు ఈ సినిమాలో విలన్ ఎవరు.. ఏ బాలీవుడ్ నటుడిని దించుతారు.. ఎలాంటి ఎలిమెంట్స్ చూపిస్తారు అంటూ తెగ టెన్షన్ పడిన నందమూరి అభిమానులకు ..ఇది నిజంగా బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి . ఈ సినిమాలో బిగ్ విలన్ ని ఎవరినో దింపబోతున్నాడూ కొరటాల అని అందరూ అనుకుంటున్నారు.

ఈ సినిమాలో విలన్ ఎవరో కాదు ..తారక్ నే. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో సినిమాలో త్రీ షేడ్స్ లో ఎలా కనిపించాడో.. ఈ సినిమాలో టూ షర్ట్స్ లో కనిపించబోతున్నాడు తారక్. మొదటగా హీరోగా నటించినా ఆ తరువాత నెగటివ్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది . ఆల్రెడీ ఓ సినిమాలో నెగటివ్ గా చూసి ఫ్లాప్ అందుకున్న ఎన్టీఆర్ తో ఇలాంటి రిస్క్ ఎందుకు అయ్యా కొరటాల అంటూ జనాలు మండిపడుతున్నారు . అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఊపిరి పీల్చుకున్న అభిమానులకు దీంతో మళ్లీ కొత్త టెన్షన్ స్టార్ట్ అయినట్లుంది . చూడాలి మరి దీనిపై కొరటాల ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news