సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎక్కువగా వింటూ వస్తున్నాం. అయితే కొన్ని వార్తలు నిజం కావు అని తెలిసిన వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి . అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి . ప్రెసెంట్ అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ అయిపోతుంది . రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ పాపను దత్తత తీసుకోబోతున్నాడు అంటూ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
మనకు తెలిసిందే మొదటి నుంచి ఎన్టీఆర్ కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం . ఈ క్రమంలోనే మొదటి కొడుకు పుట్టిన ఎన్టీఆర్ కి.. ఆ తర్వాత పాప పుడుతుందని ఎంతో ఆశగా వెయిట్ చేశారట. కానీ రెండోసారి కూడా కొడుకు పుట్టడంతో డిసప్పాయింట్ అయిన తారక్ ఆ కోరిక తీర్చుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఈ బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది . ఎన్టీఆర్ త్వరలోనే ఓ పాపను దత్తత తీసుకోవాలని చూస్తున్నారట .ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . ఇప్పటికైనా ఎన్టీఆర్ తన కోరిక నెరవేరబోతుంది అంటూ కంగ్రాట్యులేషన్స్ చెప్పుకొస్తున్నారు..!!