జయప్రద అందాల సుందరి. అచ్చ తెలుగు అమ్మాయి. ఏపీలోని రాజమహేంద్రవరం ఆమె స్వస్థలం. 1970 సినిమాల్లోకి ఎంటర్ అయిన జయప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన జయప్రద నేషనల్ వైడ్ గా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. జయప్రద అందానికి నార్త్ ఇండియన్ సినిమా జనాలు ఫిదా అయిపోయారు.
సినిమా పరంగా ఆమెకు ఎంత మంచి పేరు ఉన్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె కోలుకోలేని తప్పులు చేసి తన కెరీర్ నాశనం చేసుకుంది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నా శ్రీకాంత్ నహతాను ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత సునీల్ నహతా కుమారుడే శ్రీకాంత్ నహత. అయితే అప్పటికే శ్రీకాంత్‌కు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా జయప్రద అతడి మాయలో పడింది.
చాలామంది ఇంత మంచి జీవితం ఉండగా ఎందుకు ? అతడిని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పిన ఆమె వినలేదు. అయితే శ్రీకాంత్‌తో పెళ్లి జరిగిన ఒకటి రెండు నెలలకే అతడు చేసిన మోసం బయటపడింది. మరో దారుణం ఏంటంటే శ్రీకాంత్ తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. శ్రీకాంత్ మొదటి భార్య నువ్వు ఎవరితో తిరిగినా ఎవరిని ? పెళ్లి చేసుకున్న నాకు అభ్యంతరం లేదు. అయితే మళ్లీ నీకు వారసుడు ఉండకూడదు.. నా పిల్లలే మనకు వారసులుగా ఉండాలన్న కండిషన్ పెట్టింది.
ఈ విషయం శ్రీకాంత్ జయప్రదకు చెప్పలేదు. ఆ తర్వాత అతడు పెట్టిన టార్చర్ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసింది. విచిత్రం ఏంటంటే శ్రీకాంత్ జయప్రదను సమాజ్ వాద్ పార్టీ అధినేత అమర్ సింగ్‌కు పరిచయం చేశారు. ఆమెను రాజకీయంగా కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత అదే అమర్ సింగ్ తో జయప్రదకు ఎఫైర్ అంటగట్టేశారు. వారిద్దరి సన్నిహిత్యాన్ని ఆసరాగా చేసుకుని జయప్రద అమర్ సింగ్ ఎఫైర్ పెట్టుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ తట్టుకోలేక జయప్రద భర్తకు విడాకులు ఇచ్చేసింది. అలా జయప్రద తన జీవితాన్ని నాశనం చేసుకుంది.