తమిళనాడు మాజీ సీఎం.. దివంగత జయలలిత.. తొలినాళ్లలో గొప్ప హీరోయిన్ అనేవిషయం తెలిసిందే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె..త ర్వాత.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా 1975-80ల మధ్య ఒక ఊపు ఊపింది. ఈ క్రమంలోనే ఆమెకు చెల్లి పాత్రలో నటించింది నటి రాధిక. రాధిక కూడా తెలుగు సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చినా.. తమిళనాడులో దుమ్ములేపుతోంది.
చిరంజీవి-రాధిక జంట అభిమానులకు కనుల పంటగా మారిన విషయం తెలిసిందే. అయితే.. రాధిక-జయలలిత చాలా సార్లు కలిసి నటించారు. చెల్లెలి పాత్రలోనూ.. తర్వాత.. సెకండ్ హీరోయిన్‌గాను తమిళ సినిమాల్లో జయ సరసన నటించారు రాధిక. అయితే.. అనంతర కాలంలో జయలలిత.. సినీ రంగాన్ని వదిలేసి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె అప్పటి ప్రముఖ నటుడు.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీ రామచంద్రన్‌కు శిష్యురాలిగా ఎదిగారు.
ఇదే సమయంలో రాధిక రాజకీయాల్లోకి రాకుండా.. సినిమాల్లోనే ఉండిపోయారు. అయితే.. డీఎంకే అధినేత కరుణానిధికి, రాధికకు మధ్య కుమార్తె, తండ్రి అన్నంత సంబంధం ఉంది. దీనికి కారణం.. రాధిక ను బట్టి.. ఆయన ఆమె నటించిన సినిమాలకు డైలాగులు రాశారు. ఈ అనుబంధంతో ఒక దశలో ఆయన రాధికను తన పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరారు. ఇదేసమయంలో జయ కూడా రాధికను తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని కోరారు.
కానీ, ఆది నుంచి కరుణతో ఉన్న అనుబంధం కారణంగా.. రాధిక.. ఆయన పార్టీకే ప్రచారం చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న జయలలిత.. రాధికతో శత్రుత్వం పెంచుకున్నారు. దీంతో జయలలిత అధికారంలో ఉండగా.. రాధిక స్థాపించి రాడాన్ టీవీకి అనుమతులు రాలేదని ఆమె చెబుతుంటారు. అంతేకాదు.. జయతో ఎక్కడై మాట్లాడాల్సి వచ్చినా.. దానికి తాను వెళ్లేదానిని కాదని కూడా రాధిక చెప్పుకొనే వారు. ఇలా.. ఆమెతో శత్రుత్వం .. యాదృచ్ఛికమే అయినా.. జీవితాంతం కొనసాగిందట.