తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నవారు .. అందాల నటుడు.. తెలుగు వారి సోగ్గాడు..శోభన్‌బాబు. ఒకానొక దశలో కృష్ణ-శోభన్‌బాబు పోటీపడి సినిమాల్లో నటించేవారు. ఆదాయంలోనూ అంతే. పోటీ పడి సంపాయించుకున్నారు. అయితే, కృష్ణ ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. ఎవరైనా తన వద్దకు అడిగితే.. ఇవ్వకుండా పంపేవారు కాదు. శోభన్‌బాబు మాత్రం రీజన్ అడిగి అందులో నిజాయితీ ఉంటే.. చేసేవారు లేకపోతే చూద్దాం అని పంపించేవారు.
ఇక, ఆదాయానికిపన్నులు చెల్లించాల్సి వస్తే.. కృష్ణ మాత్రం ఠంచనుగా లెక్కలువేసి పంపించేవారు. కానీ,శోభన్‌బాబుకు తప్పించుకునేవారట. అదేంటంటే.. ఆయనకు రాజకీయాలన్నా.. రాజకీయ నేతలన్నా.. ఒకింత ఏవగింపు ఉండేది.చెప్పేది ఒకటి చేసేదొకటి.. అని ఆయన తప్పించుకునేవారు. ఏమౌవుతుంది.. మనం కట్టిన డబ్బులతో వారు వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు కట్టాలి.. అని అనేవారు.
ఇలా తనకు వచ్చిన ఆదాయం నుంచి పొలాలు కొనేవారు. పొలంలో పంటలు వేశారు. ఇప్పటికీ మైలవరం లోరెండు వందల ఎకరాల భూముల్లో శోభన్‌బాబు కుమారుడు వ్యవసాయం చేస్తున్నారు. తమిళనాడులోనూ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ఆయన అప్పట్లోనే చేశారు. ఇలా వచ్చిన ఆదాయన్ని మాత్రమేఐటీకి చూపించేవారు. దీనికి ఎలానూ టాక్స్ కట్టాల్సి న అవసరం ఉండేది కాదు.
అయితే.. పండినం పంటంతా మాత్రం శోభన్ బాబు ఒక్కరే ఉంచుకునేవారు కాదు. కళాకారులకు పంచేవా రట. ఏటా బియ్యం, సహా ఇతర పంటలను ఆర్గానిక్ విధానంలో పండించి..అగ్రతారలకు సహా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉచితంగా ఇచ్చేవారు. ఇదే తనకు తృప్తి నిస్తుందని ఆయన చెప్పుకొనే వారు. ఐటీ విభాగానికి మాత్రం చాలా స్వల్పంగా చెల్లించేవారట. అయినా.. ఎవరూ ఆయనను ప్రశ్నించేవారు కాదట.