Movies" మీకు తెలిసిందే కొంతే.. ఇంకా చాలా ఉంది ".. మెగా...

” మీకు తెలిసిందే కొంతే.. ఇంకా చాలా ఉంది “.. మెగా ఇంటి గుట్టు బయటపెట్టిన కళ్యాణ్ దేవ్..!

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదల, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. అయితే ఇంతవరకు వీరి విడాకులపై అధికారిక ప్రకటన రాలేదు. అలాగే శ్రీజ – కళ్యాణ్ దేవ్ కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారే తప్ప విడాకుల గురించి ఎప్పుడు స్పందించలేదు.

క‌ళ్యాణ్‌, శ్రీజ వేరువేరుగా ఉంటున్న ఈ దంపతులకు పుట్టిన పాప నవిష్క కోసం మాత్రం అప్పుడప్పుడు క‌లుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కళ్యాణ్ దేవ్ త‌న కుమార్తెను మిస్ అవుతున్నట్టు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో వీరిద్దరి విడాకులు వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. క‌ళ్యాణ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు. ఇతరుల పట్ల ఎందుకు అంత ? దయ‌, జాలి చూపించాలంటే వారు ఎదుర్కొంటున్న కష్టాలు.. పడుతున్న బాధలు గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియంది కొండంత అని చెప్పాడు.

అందుకే ఎదుటివారి పట్ల మనం జాలి చూపించాలి అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేశాడు. ఇక కళ్యాణ్ దేవ్ జీవితంలో ఏం జరుగుతుందో ? తెలియకుండా చాలామంది ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్‌ను టార్గెట్ చేస్తూ శ్రీజ మంచిదని పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ పోస్టులకు కౌంటర్ గానే కళ్యాణ్ దేవ్ తాజాగా పోస్టు షేర్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక విజేత సినిమాతో హీరో అయిన క‌ళ్యాణ్‌దేవ్ ఆ త‌ర్వాత సూప‌ర్ మ‌చ్చి సినిమా కూడా చేశాడు. చివ‌ర‌గా క‌ళ్యాణ్ న‌టించిన కిన్నెర‌సాని ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆ త‌ర్వాత అత‌డు సినిమాల‌కు కూడా దూర‌మైపోయాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news