Moviesఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ప్ర‌ణీత - దేవిశ్రీ మ‌ధ్య బ్రేక‌ప్‌కు ఆయ‌నే...

ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ప్ర‌ణీత – దేవిశ్రీ మ‌ధ్య బ్రేక‌ప్‌కు ఆయ‌నే కార‌ణ‌మా ?

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ కు ఎంతో మంచి పేరు ఉంది. చాలా చిన్న వయసులోనే రాక్ స్టార్ గా దేవిశ్రీ పాపులర్ అయ్యాడు. గంధం ప్రసాద్ గా ఉన్న తన పేరు దేవిశ్రీప్రసాద్ గా మారటానికి కారణం దేవి అనే సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి తన వైపు పడేలా చేశాడు.

అలాగే తన అమ్మమ్మ దేవి, తన తాతయ్య ప్రసాద్ పేరు మధ్యలో శ్రీ అని పెట్టి దేవిశ్రీప్రసాద్ అన్న పేరును తల్లిదండ్రులు ఆయనకు పెట్టారు. దేవి సినిమా హిట్ అయ్యాక కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నవ్వుతూ బతకాలిరా- ఆనందం సినిమాలు కూడా మ్యూజికల్ హిట్టవ‌డంతో దేవిశ్రీకి ఎదురులేకుండా పోయింది. చాలా తక్కువ సమయంలోనే వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఘనత దేవికి దక్కింది.

ఇదిలా ఉంటే 40 ఏళ్లు దాటుతున్న దేవి ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. విచిత్రం ఏంటంటే కొందరు స్టార్ హీరోయిన్లతో దేవికి ఎఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ లిస్టులో ఛార్మీ కూడా ఒకరు. ఛార్మీకి దేవికి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఛార్మి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు దగ్గర కావడంతో దేవి ఆమెను దూరం పెట్టేసాడని అంటారు. అయితే అదే సమయంలో అత్తారింటికి దారేది సినిమా సమయంలో హీరోయిన్ ప్రణీతతో దేవిశ్రీకి పరిచయం ఏర్పడి.. వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న పుకార్లు కూడా వచ్చాయి.

వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారట. అదే టైంలో త్రివిక్రమ్ కి ప్రణీతికి మధ్య గొడవలు వచ్చి.. ప్రణీత ఆ మ్యాటర్‌ను రచ్చ రచ్చ చేయడంతో ఆమె తనకు సెట్ అవదని దేవీ భావించి ఆమెకు బ్రేకప్ చెప్పాడట. అలా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం అప్పట్లో టాలీవుడ్ లో పెద్ద ఇష్యూ అయింది. ఇక ఇటీవల దేవి వరుసకు తనకు దూరపు బంధువు అయిన‌ మరదలిను పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వయసులో దేవి కంటే 15 ఏళ్లు చిన్నది అని కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news