తెలుగు సినీ రంగంలో తమకంటూ.. ప్రత్యేకతను చాటుకున్న దిగ్గజ నటులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు. అనేక చిత్రాల్లో పోటా పోటీగా నటించారు. ముఖ్యంగా భూకైలాస్ వంటి చిత్రాల్లో అయితే.. స్టార్‌డమ్ ను పక్కన పెట్టిమరీ నటించారు. అయితే.. వీరిద్దరు నటించే సినిమాలకు అదే రేంజ్‌లో క్రేజ్‌కూడా ఉండేది. అభిమానుల నుంచి ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా వీరి తో చిత్రాలు చేసేందుకు ముందుకు వచ్చేవారు.
అయితే.. ఈ ఇద్దరు మహా నటుల మధ్య ప్రత్యేక మైన తేడా ఒకటి ఉండేదని చిత్ర పరిశ్రమంలో ఒక టాక్ నడిచేది. భారీ ఎత్తున సమాసాలు ఉంటే.. వాక్యాలను అన్నగారు ఎన్టీఆర్ అలవోకగా చదివేశారట. అసలు ఆయాన చాలా ఇష్టపడి మరీ వాటిని రాయించుకునేవారని అంటారు. మనకు ఇలాంటి సన్నివేశాలు.. డైలాగులు.. దాన వీరశూరకర్ణ సినిమాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఏమంటివేమంటివి.. అనే డైలాగు ఈ సినిమాలోదే.
ఇది ఎంత పాపులర్ అయిందో కూడా తెలుసు. అయితే.. అక్కినేని విషయానికి వచ్చేసరికి మాత్రం ఇలాంటి సమాస డైలాగులను ఆయన పెద్దగా ఇష్టపడే వారు కాదట. ఉదాహరణకు ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ డైలాగుల ప్రస్తావన వచ్చినప్పుడే ఇవన్నీ ఎందుకు.. సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా డైలాగులు ఉంటే చాలదా!
అని చెప్పేవారట. దీంతో అక్కినేని, ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాల్లో సమాసాలు భారీ డైలాగులు అన్నీ అన్నగారి పాత్రలకే పరిమితం అయ్యేవి.
ఇక, ఎన్టీఆర్‌కు మాత్రం భారీ డైలాగులు యాక్షన్ సీన్లు ఉండేవట. అయితే.. ఎవరు ఎలాంటి పాత్రలు చేసినా.. ఎలాంటి డైలాగులు మాట్లాడినా.. ఎవరి రేంజ్ వారిదే. ఎవరి అభిమానులు వారికే ఉండేవారు. దీంతో సినిమాలు అదే రేంజ్‌లో హిట్ కొట్టేవి.