సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఏ హీరో అభిమాని ఆ హీరోని గౌరవిస్తూ ఉంటారు అయితే అల్లు అర్జున్ ని మాత్రం మిగతా హీరో ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. అందుకు కారణం బన్నీ ఎప్పుడు అందరి హీరోలకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు . దానికి మెయిన్ రీజన్ బన్నీలో ఉన్న పాజిటివిటీ అనే చెప్పాలి. కాగా నిన్న బన్నీ పుట్టినరోజు తన 40వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ రచ్చ రచ్చ చేశారు . అఫ్ కోర్స్ ఫేవరెట్ హీరో పుట్టినరోజు అంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా ..? ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ .. ప్రముఖులు .. ఫ్రెండ్స్ .. ఫ్యామిలీ మెంబర్స్..సోషల్ మీడియా వేదికగా బన్నీకి విషెస్ చెప్పకువచ్చారు . అయితే అందరిలోకి బన్నీ విషెస్ వెరైటీగా చెప్పారు . మనకు తెలిసింది జూనియర్ ఎన్టీఆర్ – బన్నీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ .
సినిమాల పరంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్న పర్సనల్గా చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . స్నేహ ని సొంత చెల్లిగా భావిస్తాడు తారక్.. బన్నీ కూడా ప్రణతి ని సిస్టర్ లా చూస్తారు. ఈ క్రమంలోనే బన్నీ పుట్టినరోజు సందర్భంగా “హ్యాపీ బర్త డే బావ” అంటూ చాలా ముద్దుగా ప్రేమగా విష్ చేశాడు తారక్. తారక్ కి రిప్లై ఇస్తూ “థాంక్యూ బావ.. వార్మ్ హగ్స్” అంటూ రిప్లై ఇచ్చాడు.
దీనికి తారక్ మళ్ళీ రిప్లై ఇస్తూ.. “ఓన్లీ హగ్స్ నేనా..? పార్టీ లేదా పుష్ప”.. అంటూ పుష్ప సినిమాలోని హిట్ డైలాగ్ ని ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ సైతం మళ్లీ రిప్లై ఇస్తూ..” వస్తున్న..” అంటూ కామెంట్ చేశాడు . ఈ క్రమంలోనే ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . ఇంత ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకుంటూ పలకరించుకుంటున్న ఈ హీరోల మధ్య గొడవలు అంటూ పుట్టిస్తున్న మిగతా జనాలకు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నాడు నందమూరి – అల్లు ఫ్యాన్స్. ఏది ఏమైనా సరే త్వరలోనే వీళ్ళిద్దరు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. చూద్దాం మరి మంచి టైం ఎప్పుడు వస్తుందో..?