ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సొసైటీలో ఎలాంటి కొత్త పద్ధతులను అలవాటు చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఫోటోషూట్ పేరుతో నానహంగామాలు చేస్తున్నారు. పుట్టినరోజు అయిన పెళ్లిరోజు అయిన కడుపుతో ఉన్న.. ఎలాంటి దానికైనా ఫొటోస్ ని క్యాప్చర్ చేసి భద్రంగా దాచుకోవాలి అంటూ రకరకాల ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు స్టార్స్.
కాగా పుట్టినరోజు .. పెళ్లిరోజు కు అంటే పర్లేదు కనీసం కడుపుతో ఉన్నప్పుడైనా సరే పద్ధతిగా ఉండేది తెలియదా ..? అంటూ జనాలు మండి పడిపోతున్నారు . ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . కాగా అలాంటి ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేస్తూ ఫ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది పూజా రామచంద్రన్ . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టడం తక్కువ . స్వామి రారా సినిమాలో నటించిన బ్యూటీ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు . లవ్ ఫెయిల్యూర్ ..స్వామి రారా .. అడవి కార్చిన వెన్నెల వంటి సినిమాలలో నటించిన ఈ బ్యూటీ చాలా ఫిట్నెస్ గా ఉంటుంది.
మరీ ముఖ్యంగా పూజా రామచంద్రన్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎలాంటి విషయాని అయినా సరే బోల్డ్ గా అటెంప్ట్ చేస్తూ బోల్డ్ గా మాట్లాడడంలో పూజ రామచంద్రన్ తర్వాతే ఎవరైనా.. తన బాయ్ ఫ్రెండ్ ని 2010లో వీజే క్రెగ్ ను పెళ్ళి చేసుకున్న పూజా.. ఇద్దరికి మనస్పర్థలు రావడంతో.. 2017లో విడాకులు ఇచ్చేసింది. ఇక 2019లో జాన్ కొక్కెన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటోంది. ఈ ఇద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. పూజ రామచంద్రన్ గర్భవతిగా ఉంటూ యోగా , వ్యాయామాలు చేస్తూ అభిమానులకి సరికొత్త టిప్స్ ని ఇస్తుంది .
అయితే అంతవరకు బాగానే ఉన్నా.. రీసెంట్గా పూజా రామచంద్రన్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కడుపుతో ఉన్న ఈ బేబీ పూజ రామచంద్రన్ భర్తతో లిప్ లాక్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఈ క్రమంలోనే కొందరు ఫుల్ గా ఆడేసుకుంటున్నారు . కొందరు ఇదేం పోయేకాలం కడుపుతో ఉండగా ఇలాంటి పనులు ఏంటి..? అంటూ మండిపడుతున్నారు . అయితే ఇదంతా నేటి కాలంలో ట్రెండీ ఫోటో షూట్ అంటూ కొందరు లైట్ గా తీసుకుంటుంటే.. మరికొందరు ఫైర్ అయి ఆమెను బూతులు తిడుతున్నారు . ఈ క్రమంలోనే పూజా రామచంద్రన్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!