నందమూరి నరసింహ బాలకృష్ణ వీరసింహారెడ్డి – మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు ఈ సంక్రాంతికి పోటా పోటీగా రిలీజ్ అయ్యాయి. అసలు బాలయ్య – చిరంజీవి సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి అంటేనే టాలీవుడ్ వేడెక్కిపోతుంది. అలాంటిది ఇద్దరి స్టార్ హీరోలు కలిసి నటించిన రెండు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయంటే మామూలు మజాకాదు. సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు తాజాగా 100 రోజులు పూర్తి చేసుకోబోతున్నాయి.
వసూళ్లు పరంగా చూస్తే వీర సింహారెడ్డి తొలి రోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఫైనల్ బాక్సాఫీస్ రన్‌లో బాలయ్య వీరసింహారెడ్డి కంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అయితే చిరంజీవి సినిమాకు రవితేజ ఉండటం.. రవితేజకు అంతకుముందు ధమాకా లాంటి సూపర్ హిట్ ఉండటం కూడా వీరయ్యకు ఎంతైనా కలిసి వచ్చింది.
ఇక వీరసింహారెడ్డి – వీరయ్య రెండు సినిమాలు 100 రోజులు పూర్తి చేసుకోబోతుండడంతో రెండు సినిమాలకు 100 రోజుల ఫంక్షన్లు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అయితే సెంచరీ సెంటర్స్ విషయంలో చిరంజీవి వాల్తేరు వేరయ్య కంటే బాలయ్య వీరసింహారెడ్డి పూర్తి ఆధిపత్యం చాటుకుంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సెంటర్లో మాత్రమే వంద రోజులు ఆడింది.
బాలయ్య వీరసింహారెడ్డి ఏకంగా నాలుగు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. బాలయ్య సొంత నియోజకవర్గం అయిన హిందూపురంతో పాటు కర్నూలు జిల్లాలోని ఆలూరు – బాలయ్య సినిమాలకు అడ్డ అయినా చిలకలూరిపేటతో పాటు.. విజయవాడ శకుంతల థియేటర్లో వీరసింహారెడ్డి 100 రోజులు ఆడింది. చిరంజీవి వీరయ్య కేవలం ఒక్క సెంటర్లో మాత్రమే సెంచరీ కొడితే.. బాలయ్య నాలుగు సెంటర్లలో సెంచరీ కొట్టి తన ఆధిపత్యం చాటుకున్నాడు.