ప్రేమమ్ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్. మొదటి సినిమాతోనే అనుపమ సూపర్ హిట్ ను అందుకుంది. ప్రేమమ్ మలయాళ సినిమా అయినప్పటికీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాష రాకపోయినా సరే ప్రేమమ్ సినిమాను సబ్ టైటిల్స్ చదువుతూ మరీ చూశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయిపల్లవితో పాటూ అనుపమకు కూడా ఓవర్ నైట్ స్టార్స్ అవ్వడంతో ఆ తరవాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా రానిస్తుండగా అనుపమ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. మొదట ఈ బ్యూటీ గ్లామర్ షో కు దూరంగా ఉన్నప్పటికీ మెల్లిమెల్లిగా గ్లామర్ తెరలు తెంచుకుంటోంది. ఇక ప్రస్తుతం అనుపమ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలతో బిజీ అయినప్పటికీ అనుపమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
అనుపమకు సోషల్ మీడియాలో మిలియన్ ల కొద్ది అభిమానులను ఉన్నారు. దాంతో తరచూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఇక అనుపమ ఫోటోలకు పెట్టే క్యాప్షన్ లు కూడా నెటిజన్ లను అభిమానులను ఆకట్టుకునేవిధంగా ఉంటాయి. తాజాగా అనుపమ చుడిదార్ వేసుకుని ఓ హోటల్ ఓ భోజనం కోసం ఎదురుచూస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలకు నా మూడ్ రోజులో 365 సార్లు స్వింగ్ అవుతుంది.. ఆకలేసినప్పుడు అయితే మరింత వరస్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక దానికి హీరోయిన్ శ్రీలీల ఫుడ్ నీ పక్క టేబుల్ వాడికి ఇచ్చి నీకు ఇవ్వకపోతే అంటూ కామెంట్ పెట్టింది. దాంతో అనుపమ ఆ ట్వీట్ కు అది మరింత బాధకరం… అంటూ రిప్లై ఇచ్చింది. దాంతో నెటిజన్ లు అనుపమను ఆడేసుకుంటున్నారు. ఫుడ్ కోసం ఆగలేకపోతున్నావా… బాబోయ్ ఆ ఎక్స్ ప్రెషన్స్ ఏంటి అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం అనుపమ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.