టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో ప్రభాస్ .. ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ పోతున్నారు . ఎటువంటి నెగటివ్ మార్కులు లేకుండా దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం అభిమానులను తీవ్రంగా హార్ట్ చేస్తున్నారు . ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కల. సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు కూడా అదే కోరుకుంటున్నారు.
అయితే ప్రభాస్ మాత్రం ఆ పని పూర్తి చేయట్లేదు . ఇలాంటి క్రమంలోనే రోజుకో వార్త తెర పై ఇంట్రెస్టింగ్ గా మారుతూనే వస్తుంది . రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి విషయంలో మరో ముందడుగు పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్ కి కుజదోషం ఉందని ఆ కారణంగానే పెళ్లి లేటవుతుంది అని .. ఈ క్రమంలోనే కుజ దోషం ఉన్న అమ్మాయినే ఇచ్చి చేయాలని ప్రభాస్ అమ్మగారు మొదట్లో మూర్ఖంగా పట్టుబట్టారట.
ఆ తర్వాత ప్రభాస్ అమ్మగారు తగ్గి ఏ అమ్మాయి అయినా పర్లేదు .. పెళ్లి చేసుకో అని చెప్తుంటే ప్రభాస్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటివరకు కుజ దోషం నివారణ పూజలు ప్రభాస్ చేయలేదట . మరీ ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభాస్ ప్రేమిస్తున్నాడు అని చెప్పుకుంటున్న అమ్మాయి అనుషకకి కుజదోషం లేదట. ఒక్కవేళ్ల వీళ్లు పెళ్ళి చేసుకుంటే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి జరగాలంటే కచ్చితంగా కుజదోష నివారణ పూజలు చేయాల్సిందే అంటూ చెప్పుకోస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ పుజలు మంత్రాలు ఏవి నమ్మరట. ఈ క్రమంలోనే జనాలు ప్రభాస్ పెళ్లి పై ఆశలు వదులుకుంటున్నారు..!!