సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అన్నా.. వచ్చిన తర్వాత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనుకున్న ..కచ్చితంగా గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్ . ఈ రంగుల ప్రపంచంలో గ్లామరస్ గా లేకపోతే స్టార్స్ గా మారలేరు . డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరూ కూడా పైకి పెద్ద మాటలే చెబుతున్నా సరే గ్లామర్ గా లేని హీరోయిన్ ని ఏనాడు ఎంకరేజ్ చేయరు . ఇప్పటివరకు మనం చూసుకున్న సినీ ఇండస్ట్రిలో లెక్కలను బట్టి ఆ విషయం అందరికీ క్లియర్ గా తెలిసిపోతుంది .
కాగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం బ్యూటీస్ ఎంత గ్లామరస్ గా తయారవుతూ ఫిజిక్ ని ఏ రేంజ్ లో మైంటైన్ చేస్తూ ఉంటారో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ కోట్లకు కోట్లు ఖర్చు చేసే బాడీని కరెక్ట్ పొజిషన్లో షేపుల్లో ఉంచడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే అటువంటిది ఏదీ లేదు అంటూ ఇండస్ట్రీలో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి .
ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ..ఆ తర్వాత ఫిదా తో తెలుగు ఇండస్ట్రీని ఏలేసింది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తన ఫిజిక్ కి సంబంధించిన అసలు సీక్రెట్ చెప్పేసింది. డైటింగ్స్ ఎక్సర్ సైజ్ లు, యోగా , జాగింగ్ ఇలాంటివి ఏవి చేయనని .. నచ్చిన ఫుడ్ ని.. ఇష్టంగా నాలుగు సారు అయినా పెట్టుకుని తింటానని ..అయితే కచ్చితంగా రోజుకి ఒక గంట అయినా డ్యాన్స్ చేస్తానని ..అది నా హ్యాబిట్ అని.. ఆ కారణంగానే నేను ఇలా ఉండగలుగుతున్నాను అంటూ చెప్పకు వచ్చింది . ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇంత అందంగా హాట్ గా కనిపించడానికి కారణం ఆమె చేసే డాన్స్ నేనా.. వావ్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు ఆమె ఫ్యాన్స్..!!