టాలీవుడ్ సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో ..అభినయంలో ..పాటలు పాడడంలో అమ్మడు స్టైలే వేరు . స్టార్ హీరోయిన్ కి మించిపోయిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న గీతామాధురి.. టాలీవుడ్ యంగ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకుంది . కాగా నందు కంటే సూపర్ క్రేజ్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న గీతామాధురికి హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వచ్చాయి .
అప్పట్లో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం గీతామాధురికి హీరోయిన్గా అవకాశాలు ఇచ్చాడట. గీతామాధురి కున్న క్రేజ్.. అందం పరిగణలోకి తీసుకున్న పలువురు స్టార్ డైరెక్టర్ లు ఆమె ను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి దింపాలని చూసారని .. అయితే ఏమాత్రం ఇండస్ట్రీలో తెరపై కనిపించడం ఇష్టం లేని గీతామాధురి ఆఫర్ లని రిజెక్ట్ చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇప్పటికి గీతామాధురికి ఆఫర్లు వస్తున్నా సరే అదే మాటగా చెప్తుందట .
ఇండస్ట్రీలో పాటలు పాడడం తప్పిస్తే నటించడం నాకు రాదు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుందట. ప్రజెంట్ నందు ఫైనాన్షియల్ గా ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవేళ గీతామాధురి ఆరోజు ఆఫర్ ని గాని సెలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బడా హీరోయిన్ గా నిలిచేది. ఆమెకున్న టాలెంట్ కి పాన్ ఇండియా లెవల్ లో సినిమాలో కూడా చేసేది.. ఆనాడు ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఆమె ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేలా చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు . అయితే మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం గీతా మాధురి నటించకుండా మంచి పని చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు..!!