Movies"ఆ విషయం అందరికి తెలిసిందేగా"..ఆ ఒక్క మాటతో చైతన్య పరువు తీసేసిన...

“ఆ విషయం అందరికి తెలిసిందేగా”..ఆ ఒక్క మాటతో చైతన్య పరువు తీసేసిన సమంత..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడిన భూతద్దంలో పెట్టి చూసి దాని డబల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సింపుల్గా చేసిన కామెంట్స్ ని సైతం దారుణంగా ట్రెండ్ చేస్తున్నారు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శాకుంతలం . సమంత హీరోయిన్గా మలయాళ హీరో దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు .

ఈ క్రమంలోనే ఏప్రిల్ 14న గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత అటెండ్ అయిన ఇంటర్వ్యూలల్లో సమంతకు సంబంధించిన పర్సనల్ క్వశ్చన్ ఎదురైంది. సమంత అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూలలో సినిమా కన్నా కూడా పర్సనల్ లైఫ్ , విడాకుల గురించి హెల్త్ గురించి అడుగుతూ ఉండడంతో విసుగు చెందిన సమంత.. స్ట్రాంగ్ గా ఇచ్చి పడేసింది.

“నా జీవితం తెరిచిన పుస్తకం .. నా లైఫ్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు . నాకు తెలియకుండానే సోషల్ మీడియాలో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి . నా జీవితం ఓ తెరిచిన పుస్తకం లాంటిది దాపెట్టడానికి ఏదీ లేదు ..ఫేక్ గా నటించే అంత అవసరం నాకు లేదు . ఉన్నది ఉన్నట్లు చెప్తాను ” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అయితే సమంత కావాలనే ఈ కామెంట్స్ నాగచైతన్య పై చేసిందని చెప్పుకొస్తున్నారు కొందరు జనాలు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎలా సీక్రెట్ గా రిలేషన్షిప్ కొనసాగిస్తున్నారు తెలిసిందే. అయితే సమంత వాటిని కొట్టి పడేస్తూ..నా జీవితంలో ఏం జరిగినా జనాలకి తెలుస్తుంది అని చెప్పడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news