సాధారణంగా.. సినిమాల్లో భార్యా భర్తలు నటించిన సందర్భాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఎవరూ కూడా తమ భార్యలను సినిమాల్లోకి తీసుకురాలేదు. కానీ, హీరో కృష్ణ మాత్రం తన భార్య..(సాక్షి సినిమా తర్వాత..వివాహం చేసుకున్నారు) విజయనిర్మలతో కలిసి అనేక సినిమల్లో కలిసి నటించారు. అయితే.. ఎక్కువగా ప్రేమికులుగా భార్యాభర్తలుగానే నటించారు.
కానీ, వీటికి భిన్నమైన కథలు వచ్చినా.. కాదనకుండా చేశారు. ఇలా వచ్చినవే.. అన్నా చెల్లెళ్ల పాత్రలు. వీరిద్దరూ ఇలా అన్నాచెల్లెలుగా నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నాక, అలాగే కథానాయకులుగా నటించాక ఇలా అన్న చెల్లెలుగా నటించారు. రామానాయుడు నిర్మించిన వాటిలో ‘బొమ్మలు చెప్పిన కథ` ఒకటి. ఈ సినిమా ఏప్రిల్ 4, 1969 లో విడుదల అయింది.
ఈ సినిమాకు జి. విశ్వనాథం అనే అప్పటి దర్శకుడు దర్శకత్వం వహించారు. కృష్ణ, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ, శివరాం, రాజబాబు, సత్యనారాయణ, మిక్కిలినేని, విజయనిర్మల, విజయలలిత , గీతాంజలి, హేమలత లాంటి నటులు పని చేశారు.ఇదే సినిమాలో కృష్ణ, విజయనిర్మల అన్న చెల్లెలుగా నటించాల్సివచ్చింది. దీనికి వారు ఓకే అన్నారు.
ఇక, విజయనిర్మల ఇందులో కాంతారావు పక్కన భార్యగా నటిస్తే, కృష్ణ పక్కన గీతాంజలి వేసింది. ఈ సినిమా తో పాటు కృష్ణ విజయ నిర్మల అన్న చెల్లెలు గా నటించిన చిత్రాలు ఇంకో రెండు వున్నాయి. అవి మంచి మిత్రులు’ ‘ముహూర్తబలం’ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్ళుగా నటించారు. ఈ సినిమాలు కూడా బాగానే ఆడడం గమనార్హం. అయితే.. ఎప్పుడూ.. ఇలా నటించవద్దన్న ఎన్టీఆర్ సలహాతో వారు తర్వాత ఆగిపోయారు.