మీనాక్షి శేషాద్రి ఒకప్పటి హీరోయిన్.. గుర్తుందా ? ఔరా అమ్మకు చెల్ల…అంటూ.. చిరంజీవి పాడిన పాటకు లంగా ఓణీలో స్టెప్పులు వేసిన నటి.. ఆపద్బాంధవుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర(ఎన్టీఆర్) సినిమాల్లో నటించిన.. హీరోయిన్‌గా మీనాక్షి శేషాద్రి తనదైన ముద్ర వేసుకుంది. తెలుగులో నటించిన సినిమాలు రెండే అయినా.. చెరగని ముద్ర వేసుకున్న మీనాక్షి శేషాద్రి.. ఉత్తరాదిలో అనేక సినిమాలు చేసింది.
నిజానికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మీనాక్షి అసలు పేరు. శశికళ. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. అయితే.. 1983లో కెరీర్‌ను ప్రారంబించిన మీనాక్షి.. 1997 వరకు ఎక్కడా విరామం తెలియకుండా.. నటించా రు. హిందీతోపాటు.. తెలుగు, తమిళ భాషల్లోనూ ఆమె నటించడం గమనార్హం. ఎంత వేగంగా తన కెరీర్‌ను ఆమె ముగించారంటే.. అప్పటికి సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఆమె కాల్ షీట్ల కోసం.. బాలీవుడ్ నిర్మాతలు క్యూ కట్టారు. ఖచ్చితంగా అదే సమయంలో ఆమె తప్పుకొన్నా రు. ప్రముఖ వ్యాపార వేత్త, ముంబైకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన మీనాక్షి.. సంప్రదాయ పద్ధతిని ఎప్పుడూ.. దాటి వ్యవహరించలేదు. స్విమ్ సూట్.. క్లీవేజ్ షో.. సహా.. ఎలాంటి అభ్యంతరకర సీన్లలోనూ నటించింది లేదు. అందుకే.. మీనాక్షి శేషాది.. వెండి తెరకు దూరమైనా… ఆమె జ్ఞాపకాలు మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.