నిజానికి ఒక సినిమా మొత్తం హీరోకు చొక్కలేకుండా ఉంటుందా? ఇలా ఊహించేందుకు కూడా ఇబ్బంది గానే ఉంటుంది.ఇలా రెండున్నర గంటల సినిమాలో హీరోకు చెక్కా లేకుండా.. కేవలం పంచెతోనే నటించాలంటే.. ఎవరు ఒప్పుకొంటారు? ఎవరు సాహసిస్తారు? పైగా మంచి పేరున్న నటులు, హీరోలు. అందుకే ఎవరూ ముందుకు రాలేదు. కానీ, పాత్రలనుపరిశీలిస్తే.. చొక్కా వేసుకునే అవకాశం లేదు.
పైన ఒక కండువా.. కింద ఒక పంచె. ఈ రెండు మినహా .. సినిమా మొత్తంలో హీరోకు మరో వేషధారణే లే దు. పోనీ.. హీరోలు డిమాండ్ చేస్తున్నారని మార్చే అవకాశం ఉందా? అంటే.. కథలో ఆ అవకాశం లేదు. మ రి ఏం చేయాలి? ఇదే.. భానుమతి-రామకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసిన విప్రనారాయణ సినిమాకు పెద్ద అడ్డం కిగా మారింది. కధ రెడీ. పైగా పురాణ గాధ, జరిగింది కూడా. తమిళనాడు నేపథ్యం. అన్నీ రెడీ అయిపోయాయి.
వేశ్యకు.. శ్రీరంగనాధుని అపర భక్తుడికి మధ్య సాగే ప్రేమాయణం. వేశ్య పాత్రలో భానుమతి నటించారు. మరి హీరో ఎవరు? అంటే.. రామకృష్ణకు ఎంతో ఇష్టమైన అన్నగారు ఎన్టీఆర్‌ను సంప్రదించారు. ఆయన కథంతా విన్నారు. చాలా బాగుంది అన్నారు. కానీ, చొక్కలేకుండా.. సినిమా మొత్తం నటించాలంటే.. కుదరదని తేల్చి చెప్పారు. ఎక్కడో ఒకటి రెండు సీన్లయితే ఫర్వాలేదు కానీ..సినిమా సినిమా మొత్తం చొక్కాలేకుండా నటిస్తే.. అభిమానులు హర్టవుతారని తేల్చి చెప్పారు.
ఇక, రెండో ప్రయత్నం అక్కినేని. ఆయనకూడా ఇదేమాట చెప్పారు. దీంతో తొలి దశ షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా ఇక తెరకెక్కదని అనుకున్నారు. సినిమాలో మార్పులు చేద్దామని రామకృష్ణ సూచించారు. కానీ, భానుమతి మాత్రం.. మన బిజినెస్ కోసం.. వాస్తవాలు మారుస్తామా ? అని భీష్మించారు. ఇలా ఏడాది గడిచిపోయింది. ఎందుకో తెలియదు కానీ.. అక్కినేని స్వయంగా వచ్చి.. సినిమాకు ఒప్పుకొన్నారని.. భానుమతి చెప్పారు.
సినిమా మొత్తంలో ఎక్కడా చొక్కా ఉండదు. పైగా పిలక పెట్టుకుని నటించారు. అప్పటికే అక్కినేని స్టార్‌డమ్ ఉన్న హీరో. అయినా.. ఈ సినిమాలో అలానే నటించారు. ఈ సినిమా విజయవాడలో ఏడాదిపాటు ఆడింది. పెద్ద ఎత్తున సంబరాలు చేసి విజయవాడ నగరంలో రోజు రోజంతా భోజనాలు పెట్టారు. తమిళనాడులోని శ్రీరంగంలోనూ ఇలానే చేశారు.