టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో సింహా, లెజెండ్ సినిమాలతో పాటు యేడాదిన్నర క్రితం వచ్చిన అఖండ సినిమా కూడా పెద్ద బ్లాక్‌బస్టర్. బాలయ్య కెరీర్లోనే అప్పటి వరకు ఉన్న సినిమాల రికార్డులు అన్నింటిని అఖండ తిరగరాసింది. అఖండ సినిమాలో అఘోర పాత్ర చూశాక .. అసలు బాలయ్య కెరీర్లో ఆయన చేసిన మిగిలిన పాత్రలు ఒక ఎత్తు.. ఈ అఘోర పాత్ర ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది.
అఖండ సినిమాలో శివుడ్ని, శివ భక్తితో పాటు బాలయ్య నట విశ్వరూపాన్ని చూపించి తిరుగులేని అఖండ విజయం ఇచ్చాడు బోయపాటి. ఈ సినిమా వచ్చి సూపర్ హిట్ కొట్టినప్పటి నుంచి సీక్వెల్ కోసం నందమూరి, బాలయ్య అభిమానులు వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ అభిమానుల ఆశలను మరింత పెంచేస్తూ బోయపాటి అఖండకు సీక్వెల్‌గా అఖండ 2 ఉంటుందని ప్రకటించాడు.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ చేస్తున్నారు. ఇక అఖండ 2 లో పొలిటికల్ అంశాలే మెయిన్ హైలైట్ గా బోయపాటి టీం స్క్రిఫ్ట్ రెడీ చేస్తోందట. ఇక బాలయ్యకు కలిసి వచ్చినట్టుగానే ఈ సీక్వెల్లోనూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
బాలయ్య రెండు పాత్రలు కూడా చాలా వేరియేషన్లలో ఉంటాయని… బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడేలా ఓ సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథ ప్లాన్ చేసినట్టు మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అఖండ 2ను పట్టాలు ఎక్కించేయనున్నాడు.