గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి .. అల్లు ఫ్యామిలీకి మధ్య అసలు పడడం లేదని అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవికి మరింతగా వార్ జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు అందుకున్న ఏమాత్రం స్పందించని అల్లు అర్జున్.. ఆయన ఇచ్చిన పార్టీకి కూడా అటెండ్ అవ్వలేదు అంటూ జనాలు మండిపడ్డారు .
అయితే తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ మరోసారి ఈ ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి అంటూ అర్థం వచ్చేలా చేసినట్లు అయింది. మనకు తెలిసిందే ఈరోజు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు . ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్లతో ..ఫ్లెక్సీలతో.. కేక్ కటింగ్ చేస్తూ బన్నీ ఫ్లెక్సీ లకి పూలదండలు వేసి పాలాభిషేకాలు చేస్తున్నారు .
ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్.. ఫ్రెండ్స్ ..ఫ్యామిలీ మెంబర్స్ విష్ చేస్తున్నారు . కాగా బన్నీకి లైఫ్ ఇచ్చిన చిరంజీవి కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు . “హ్యాపీ బర్త్డే బన్నీ మ్యెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే ..పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ రాక్ ” అంటూ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అల్లు అర్జున్ బర్త్ డే కి విష్ చేసేటప్పుడు కనీసం ఆయన ఫోటో కూడా షేర్ చేయడం తెలియదా అంటూ అల్లు ఫాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు కావాలనే ఇలా బన్నీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మెగాస్టార్ ఇలా చేశారు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అయితే మరికొంత మంది బన్నీ ఫ్యాన్స్ కి బాగా కాలింది అని ..అందుకే ఇంతలా చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు . అంత పెద్ద హీరో కనీసం ఫోటో కూడా షేర్ చేయకపోవడం ఏంటి..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..!!