బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అలియాభట్ .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న అలియా భట్ ..పెళ్లైన 2నెలల కి తల్లి కాబోతున్నానంటూ బిగ్ బాంబు పేల్చింది. అఫీషియల్ గా తన ప్రేగ్నేన్సి ని కన్ఫామ్ చేస్తూ రీసెంట్ గానే పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . ప్రెసెంట్ ఓ పక్క బేబీ ని మరోపక్క సినిమాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్న అలియాభట్ ‘ఈద్ ఏ మమ్మ’ అనే క్లోతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు .
ఈ క్రమంలోనే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కి స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ ను పంపించిన అలియా భట్ .. రీసెంట్గా కడుపుతో ఉన్న ఉపాసనకు ప్రెగ్నెన్సీ కిట్ ను గిఫ్ట్ గా చేసింది . ఈ క్రమంలోనే ఉపాసన ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేస్తూ “థాంక్యూ అలియా భట్ .. ప్రజెంట్ నాకు ఇదే కావాలి ” అంటూ అలియా భట్ ని ట్య్యగ్ చేస్తూ పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే అలియా పంపిన కిట్ లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి .
అంతేకాదు పుట్టుబోయే బేబీకి సంబంధించిన ఐటమ్స్ కూడా పంపించింది. దీంతో అలియాభట్ తన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటుందని ..ఇలా స్టార్ సెలబ్రిటీస్ పిల్లలకి కాదు డబ్బు లేని వాళ్ళకి కూడా పంపిస్తే తన బ్రాండ్ ఇంకా పాపులారిటీ సంపాదించుకుంటుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరోపక్క అలియా భట్ ఏం చేసినా నెగటివ్ గానే ట్రోల్ చేస్తారా అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు..!!