సినిమా అభిమానుల వెర్రి వెయ్యింతలుగా ఉంటోంది. ఒక్కోసారి వెర్రి అభిమానంతో ఏం చేస్తున్నారో తెలియనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోసం ఓ అభిమని గుడి కడుతున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లో సమంత కోసం గుడిని కట్టేస్తున్నాడు. సమంత పుట్టినరోజు నాటికి గుడి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటి స్టార్ హీరోయిన్లలో అభిమానుల చేత అప్యాయంగా గుడి కట్టించుకున్న హీరోయిన్గా సమంత నిలిచిపోనుంది. పాత తరం హీరోయిన్లలో సావిత్రి ఆ తర్వాత తమిళ స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూడా గుళ్లు కట్టించుకున్నారు. ఆ తర్వాత హన్సిక, నమిత, నిధి అగర్వాల్ లకు తమ అభిమానులు గుళ్ళు కట్టారు. ఇక ఇప్పుడు వీరి లిస్టులో సమంత కూడా చేరిపోయింది.
1991లో చిన్నతంబి ( తెలుగులో చంటి సినిమా) షూటింగ్ జరుగుతుండగా ఖుష్బూ కోసం ఆమె ఫ్యాన్స్ గుడి కట్టారు. అప్పట్లో అది ఓ సెన్షేషన్. అయితే ఇప్పుడు సమంతకు గుడి కట్టడంతో వాడికి ఏమైనా పిచ్చా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సమంత తెలుగు సినిమా రంగంలో గొప్ప పేరున్న అక్కినేని కుటుంబ కోడలిగా అడుగు పెట్టింది.
నాగచైతన్య భార్యగా, నాగార్జున కోడలిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె నాలుగేళ్లకే కాపురం పెటాకులు చేసుకుంది. ఇక ఇప్పుడు అసలు ఓ తెలుగు ఇంటి కోడలి అయ్యాను అన్న విచక్షణ మర్చిపోయి బరి తెగించి మరీ అందాలు ఆరబోస్తోంది. అసలు ఆమె క్రేజ్ రోజురోజుకు తగ్గిపోతోంది. పైగా ఆమెకు హీరోయిన్ ఛాన్సులు కూడా ఎవ్వరూ ఇవ్వట్లేదు. అంత రెచ్చిపోతోన్న సామ్‌కు గుడి కట్టడం ఏంట్రా.. వీడు ఇంత పిచ్చోడేంట్రా అన్న చర్చలు ఇప్పుడు నెటిజన్ల మధ్య జరుగుతున్నాయి.