గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో హల్చల్ చేస్తుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . మొదటి నుంచి నిహారిక అంటే ఎందుకో సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో నుండి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చిన ఏకైక ముద్దుగుమ్మ నిహారిక అని.. ఆ కారణంగానే జనాలు చీటికిమాటికి ఆమెని ట్రోల్ చూస్తూ విసిగిస్తూ ఉంటారు .
రీసెంట్గా నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త హల్చల్ చేస్తూ దాదాపు 15 రోజులు పైనే అవుతుంది. అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ ఈ న్యూస్ పై ఏ విధంగా స్పందించలేదు . అంతేనా నిహారిక సైతం ఈ విషయాన్ని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో పలు రకాల పోస్ట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ నిహారిక విషయంలో వెనక్కి తగ్గారని ..చిరంజీవి పెద్దమనుషుల మద్దిస్తంతో నిహారిక – చైతన్య మధ్య గొడవ సర్దుమణిగిందని క్లారిటీ వచ్చింది .
అంతేకాదు చైతన్యకు – నిహారిక అంటే ఇష్టమే .. కానీ ఆమె ఫ్రెండ్షిప్ ఆమె ఫ్రెండ్స్ హద్దులు మీరుతుండడంతోనే నిహారికను కంట్రోల్లో పెట్టరని చూశారని ..మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రిలో నిహారిక ఉండడం వాళ్లకి ఇష్టం లేదని .. ఈ ఫైనల్ డెసిషన్ తోనే చిరంజీవి సైతం నిహారికకు ఇండస్ట్రీలో ఇక కనిపించదు అంటూ హెచ్చరించి మరి మంచి మాటలు చెప్పారట. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం నీహారిక అంత అదృష్టవంతురాలు మరెవ్వరూ ఉండరు అంటున్నారు చైతన్య ఫ్యాన్స్ . చైతన్య చాలా మంచి వాడు అని.. నువ్వంటే ప్రాణమిస్తారని ..ఇకనైనా పట్టింపులు మాని ఇద్దరు హ్యాపీగా ఉండండి ..అంటూ కామెంత్స్ చేస్తున్నారు. చూడాలి మరి నిహారిక – చైతన్య ఈ న్యూస్ పై ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో..?