ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా ఒకటే పేరు మారుమ్రోగిపోతుంది. అదే ఆర్ ఆర్ ఆర్. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఫస్ట్ టైం ఇండియన్ సినిమాకి అది కూడా మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వరించింది . దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది.
దీంతో ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాశాడు రాజమౌళి .ఇప్పటివరకు తెలుగు సినిమా ఆస్కార్ కి నామినేట్ అయిందే లేదు . ఇండియన్ సినిమాకు ఆస్కార్ వచ్చింది లేదు .కానీ ఫస్ట్ టైం ఆ కోరిక తీర్చేసాడు రాజమౌళి . ఈ క్రమంలోని రాజమౌళి హాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు . “నిజానికి మేము ఆరారార్ కి ఆస్కార్ వస్తుందని అనుకోలేదు. సినిమాను జనాలు ఎంటర్టైన్ విధంగా చూడాలని తెరకెక్కించాం. ఫైనల్లీ ఆస్కార్ వచ్చింది . వి ఆర్ సో హ్యాపీ.. అసలు ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడానికి ప్రధాన కారణం నేను కాదు.. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్”.
” ఈ సాంగ్ కోసం ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కింది . ఎన్నోసార్లు డాన్స్ స్టెప్స్ విషయంలో కేర్ తీసుకున్నాడు. ఎన్నోసార్లు టేక్స్ తీసుకొని వాళ్లకు అర్ధమయ్యే విధంగా చెప్పాడు .అలాగే ఎన్టీఆర్ తారక్ కూడా ఈ సినిమాకి ప్రాణం పోశారు . ఇక పాట పాడిన రాహుల్, కాలభైరవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..వాళ్లు లేకపోతే పాట లేదు . ఫైనల్లీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మొత్తం తెరవెనుక ఉండి కథ నడిపించింది ఆయనే ఇలా ..అందరి సపోర్ట్ తోనే ఆస్కార్ వచ్చింది..” అంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు..!!