వాట్.. ఘట్టమనేని ఫ్యామిలీలో మరో పెళ్లి జరగబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీలో ఎలాంటి సిచువేషన్ జరుగుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే . బ్యాక్ టూ బ్యాక్ మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని మహేష్ బాబు పుట్టెడు బాధలో ఉంటే..మహేష్ బాబు ఫ్యామిలీ లో పెళ్లి సంబరాలు జరుగుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే పవిత్ర ను.. విజయనిర్మల కొడుకు నరేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .
వీళ్ళ పెళ్లి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . కాగా ఇలాంటి క్రమంలోనే ఘట్టమనేని ఇంటిపేరు ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మహేష్ బాబు మేనల్లుడుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గల్ల అశోక్.. ఇండస్ట్రీలో ఉండే ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ విషయాన్ని స్వయానా గల్లా అశోక్ నే.. తన తల్లిదండ్రులకు చెప్పి మరి పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టు బట్టి మరి మొండి చేస్తున్నారట .
అయితే ఇంత చిన్న ఏజ్ లో పెళ్ళి ఏంట్రా బాబు అంటూ వాళ్ళ అమ్మ నాన్నలు ఫైర్ అవుతున్న సరే.. గల్లా అశోక్ మాట వినడం లేదట. “నేను పెళ్లి తరువాతే చేసుకుంటాను ..కానీ ఆ అమ్మాయి మన ఇంటి కోడలని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే.. బుద్ధిగా సినిమాలు చేసుకుంటానని.. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని క్రేజీ కండిషన్ పెట్టారట . ఈ క్రమంలోనే గల్లా అశోక్ చేసిన పనికి షాక్ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ” అంతేకాదు మహేష్ బాబు ఫ్యాన్స్ ఓ అడుగు ముందుకేసి..మీ వల్లే కదరా..ఘట్టమనేని ఫ్యామిలీ పరువు పోతుంది” అంటూ కామెంట్ చేయడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.