సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అని ..వచ్చి హీరోయిన్గా సెటిల్ అవ్వలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయిన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు . స్టార్ డాటర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అదే కోవాలోకి వస్తుంది. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో కోలీవుడ్లో తెలుగులో కూడా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ హీరోయిన్స్ కి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది .
వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో సమంత నటించిన యశోద సినిమాలో విలన్ గా ..బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన వీరసింహారెడ్డి సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి మెప్పించింది వరలక్ష్మి శరత్ కుమార్ . అయితే తెలుగు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇస్తే మాత్రం రిజెక్ట్ చేసిందట . నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ స్టెప్ మదర్ రాధిక చిరంజీవికి జాన్ జిగిడి దోస్త్ లు. వీళ్ళ కాంబో తెరపై ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..
మరి అలాంటి స్టార్ హీరో సినిమా ఆఫర్ ఇస్తే వరలక్ష్మి ఎందుకు రిజెక్ట్ చేసిందా అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు . అయితే బ్యాక్ గ్రౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్ కుమార్ కి ఆ కథ నచ్చలేదని ..ఆ కథకి ..ఆ కథ కంటెంట్ కి తన బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వదని.. ఈ కారణంగానే అమ్మడు ఆ స్టోరీ విని స్టార్ హీరో అయినా రిజెక్ట్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. కాగా వరలక్ష్మి రిజెక్ట్ చేసిన సినిమా ఏదో కాదు ప్రజెంట్ కీర్తి సురేష్ నటిస్తున్న భోళా శంకర్ సినిమా. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ ను అప్రోచ్ అయ్యారట. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ పాత్రకు తన బాడీ సెట్ అవ్వదు అంటూ సింపుల్గా రిజెక్ట్ చేసేసిందట. దీంతో ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకునింది వర అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!