సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసి అల్లాడించిన ముద్దుగుమ్మలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అలా ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోయిన్స్ పెళ్లికి ముందు ఇండస్ట్రీని ఏలేసి .. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు . కాగా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ లయ. స్వయంవరం సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన లయ .. తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగులో హోమ్లీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది . తనకంటూ ప్రత్యేకంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్న లయ ఏనాడు హద్దుల్ని క్రాస్ చేయలేదు .
మోడ్రెన్ పద్ధతిని అనుసరిస్తూనే .. తాను పెట్టుకున్న కండిషన్స్ బ్రేక్ చేయకుండా .. హోమ్లీ లేడీగా ట్యాగ్ చేయించుకుంది లయ. కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే లయ పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . ఈ క్రమంలోనే భర్త ఫారెన్ లో పెద్ద ఉద్యోగస్తుడు కావడంతో అక్కడికే వెళ్లిపోయి సెటిల్ అయిన లయ..పెళ్ళి, పిల్లలు తర్వాత ఇండస్ట్రీని అస్సలు పట్టించుకోలేదు . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఇండస్ట్రీకి , ఇండస్ట్రీ మనుషులకి దూరంగా ఉన్న లయ.. ఇప్పుడు తాజాగా పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ.. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది.
పలు ఈవెంట్స్ కి హాజరవుతుంది. రీసెంట్గా ఉగాది సందర్భంగా ఈటీవీ కండక్ట్ చేసిన ప్రోగ్రాంకు లయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇలాంటి క్రమంలోనే పలువురు జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు లయ ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉండింది..? ఇప్పుడే ఎందుకు టీవీలో కనిపిస్తూ హంగామా చేస్తుంది..? గతంలో అమ్మడుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి..? బడాబడా అవకాశాలు సైతం రిజెక్ట్ చేసింది లయ. ఎందుకు ఇప్పుడు వచ్చిన అవకాశాలను వాడుకోవాలని చూస్తుంది ..? వరుసగా పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూతన పేరుని ట్రెండ్ చేయాలనుకుంటుంది..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే కొందరు లయ భర్త ఫోర్స్ కారణంగానే ఆమె ఇండస్ట్రీలోకి మళ్ళీ వస్తుంది అంటూ చెప్పుకోస్తుంటే.. మరి కొందరు మాత్రం కూతురుని హీరోయిన్గా చేయడానికి తల్లి ఈ విధంగా ప్లాన్ అమలు చేస్తుంది అంటూ వెటకారంగా స్పందిస్తున్నారు..!!