మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన సూపర్ హిట్ మూవీల్లో.. శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. మనం ఈ సినిమాలో చిరుకు తల్లిగా నటించిన క్యారెక్టర్‌గురించి చెప్పుకొంటున్నాం. ఈ సినిమాలో చిరుకు మాతృమూర్తిగా నటించారు వెన్నిరాడై నిర్మల. వెన్నిరాడై.. అనేది తమిళ సినిమా. తొలినాళ్లలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆమె పరిచయం ఈ సినిమాతోనే.
వెన్నిరాడై సినిమాలో హీరోయిన్‌గా చేసిన నిర్మల.. మన ఏపీకి చెందిన నటీమణి. కాంచన.. జయలలిత (తమిళనాడు సీఎం) వంటి అగ్రనటుల సమకాలికురాలు. ఒకరకంగా చెప్పాలంటే..వీరికంటే రెండేళ్ల ముందే సినిమా రంగంలోకి ప్రవేశించారు. అయితే.. ఆమె కెరీర్‌లో పెద్ద లోటు.. సినిమాలను మధ్యలోనే వదిలేయడం. తర్వాత.. చాలా గ్యాప్ వచ్చి.. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లోనే నటించారు. అంతేకాదు.. ఒక ఇండస్ట్రీ నుంచే కాకుండా.. చాలా ఏళ్లపాటు.. ఆమె తిరువణ్నామలైలోని రమణ మహర్షి ఆశ్రమంలో నే గడిపారు.
ఇక, వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె వివాహం చేసుకోలేదు. దీనికి కారణాన్ని కూడా ఆమె ఎప్పుడూ దాచలేదు. తను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌తో సన్నిహితంగా ఉండేవారు. మనకు ఎన్టీఆర్ మాదిరిగా అక్కడ ఎంజీఆర్ చక్రం తిప్పేవారు. ఆయన కూడా తమిళనాడు సూపర్ స్టార్. అయితే.. ఆయన రసికుడు
అనేపేరుంది. ఆయనను అనేక మంది ప్రేమించారు. వీరిలో జయలలిత కూడా ఉందనే వాదన ఉంది.
ఇక, వెన్నిరాడై చిత్రం ద్వారా పరిచయం అయిన నిర్మల కూడా.. ఎంజీఆర్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ఆయనను గాఢంగా ప్రేమించారు. ఒకానొక దశలో ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆర్థికంగా సాయం చేసేందుకు అన్నింటినీ అమ్ముకున్నారు కూడా. అయితే.. ఎంజీఆర్ ఆమెను వదిలించుకున్నారనే టాక్ ఉంది. దీంతో పెళ్లి కూడా చేసుకోకుండా ఆమె అలానే ఉండిపోయారని అంటారు.