Moviesనాటు నాటుతో హీరో చంద్ర‌బోస్ భార్య ' సుచిత్ర ' ఎవ‌రు.....

నాటు నాటుతో హీరో చంద్ర‌బోస్ భార్య ‘ సుచిత్ర ‘ ఎవ‌రు.. వీళ్ల ప్రేమ పెళ్లిలో ఏం జ‌రిగింది..!

త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చంద్రబోస్‌ను ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం యావత్ తెలుగుజాతి ఎంతో గర్విస్తోంది. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీత రచయిత చంద్రబోస్. ఇప్పుడు గూగుల్ లోను చంద్రబోస్ గురించి బాగా సెర్చింగ్ జరుగుతుంది. అసలు చంద్రబోస్ ఎవరు ? ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు… ఆయన ఫ్యామిలీ నేపథ్యం ఏంటన్న దానిపై ఒక్కటే సెర్చింగ్ నడుస్తోంది.

చంద్రబోస్ స్వగ్రామం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగెరిగే. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు గెలిచింది.. అనగానే వెంటనే గ్రామస్తులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచ స్థాయి గుర్తింపు పొందటం తెలుగుజాతికే గర్వకారణం అని వారంతా హర్షం వ్యక్తం చేశారు.

ఇక చంద్రబోస్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడే.. పాటలపై సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన తాజమహల్ సినిమాలో మంచు కొండల్లో చందమా చందనాలు చెల్లిపో అనే పాట రాశారు. ఆ పాట సూపర్ హిట్ అవడంతో అక్కడ నుంచి చంద్రబోస్ వెనక్కు తిరిగి చూసుకోలేదు.

ఇక చంద్రబోస్ ప్రేమ కథ విషయానికొస్తే ఇది ఒక అందమైన ప్రేమ కథ. దీనిని సినిమాగా కూడా తీయవచ్చు. పెళ్లి సందడి సినిమా షూటింగ్ సమయంలో సుచిత్రతో చంద్రబోస్ కు పరిచయం ఏర్పడింది. ఆమె కొరియోగ్రాఫర్ చంద్రబోస్ పాటల రచయిత అలాగే వీరిద్దరూ కలిసి పెళ్లి పీటలు సినిమాకు కూడా పనిచేశారు. ఆ సినిమా కోసం హైదరాబాద్ నుంచి చెన్నైకి విమానంలో పక్కపక్క సీట్లలోనే కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరి మధ్య సానిహిత్యం పెరిగింది.

కొన్నాళ్లకు చంద్రబోస్ ముందుగా పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర పెద్దది.. దీంతో వీరి పెళ్లికి సహజంగానే పెద్దలవైపు నుంచి ఇబ్బందులు వచ్చాయి. అయితే చంద్రబోస్ మాత్రం సుచిత్రనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని పట్టుదలకు చూసి సుచిత్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలా వీరిద్దరూ దంపతులు అయ్యారు. నిజంగా వీరి ప్రేమ కథ సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుందేమో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news