గయ్యాళి అత్త పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్యాకాంతం వ్యక్తిగత జీవితం గురించి చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసునంటే ఆశ్చర్యం వేస్తుంది. బహుభాషా ప్రవీణురాలుగా ఆమె గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకునవారు. అంతేకాదు.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, ఇంగ్లీషు భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. కథలు రాసేవారు. నవల్స్ రాసేవారు. అంతేకాదు.. సినిమాల్లో కథలకు సహకరించేవారు. ఇలా.. బహుముఖాలుగా వ్యవహరించేవారు
ఈ క్రమంలోనే ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా దక్షిణ భారత ప్రాంతీయ చిత్ర మండలి చైర్మన్‌గా చేసే అవకాశం 1960లలోనే సూర్యాకాంతం దక్కించుకున్నారు. మూడు రాష్ట్రాల్లో ఉన్న సినిమా రంగానికి ఈ దక్షిణ భారత ప్రాంతీయ చిత్రమండలి పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఉంది. దీనికి చైర్మన్‌గా ఉండాలంటూ.. ఆమెను సంఘాలు కోరాయి. అయితే. సూర్యాకాంతం తిరస్కరించారు.
అప్పటికి సినిమాల్లో భారీ బిజీగా ఉండడంతోపాటు.. కుటుంబ వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె తప్పుకున్నారు. అప్పట్లో ఆమె కాల్షీట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆమె డేట్ల కోసం దర్శక నిర్మాతలు ఎగబడేవారు. ఈ క్రమంలోనే ఆమె తనకు వచ్చిన పదవిని రిజెక్ట్ చేసి… చిత్తూరు వీ నాగయ్య అయితే.. బాగుంటుందని ఆమె సిఫారసు చేశారట. అయితే.. అసలు ఈ పదవిలో సూర్యాకాంతం ఉంటే బాగుంటుందని నాగయ్యే సిఫారసు చేసిన విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం.
దీంతో నాన్నగారు నన్ను సిఫారసు చేశారా
అంటూ.. పదవిని చేపట్టారు. అయితే..ఎక్కువ కాలం అందులో ఇమడలేక పోయారు. పాలిటిక్స్ చోటు చేసుకున్నాయని.. నిజమైన నటులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన చెందిన ఆమె.. స్వతంత్రంగానే తప్పుకొన్నారు. అయితే.. ఆమె చేసింది ఆరు మాసాలే అయినప్పటికీ.. ఉదారంగా అనేక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.