వెండితెరపై 1990 వ దశలో ఒక వెలుగు వెలిగింది. హీరోయిన్ యమున అంటే అప్పట్లో ఎమోషనల్, ఏడుపు పాత్రలకు పెట్టింది పేరు. కేవలం యమున కోసమే సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు అప్పట్లో ఉన్నారు అంటే ఏమైనా ఎంతలా ప్రభావం చూపించిందో అర్థమవుతుంది. ముఖ్యంగా మామగారు – సూరిగాడు లాంటి సినిమాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. వెండితెరపై హీరోయిన్గా అలరించిన తర్వాత ఈటీవీ విధి సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
ఈటీవీలో ఆమె రెండు మూడు పాపులర్ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. ముఖ్యంగా విధి సీరియల్ లో ఆమె పండించిన అభినయంకు తెలుగు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఇప్పటికీ కూడా యమునను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కెరీర్ పరంగా మంచి పిక్ స్టేజ్ లో ఉండగానే ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయింది.
2011లో బెంగళూరులో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఉండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారన్న వార్త బయటకు రావడంతో పెద్ద సంచలనం రేగింది. అప్పటినుంచి యమున కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆమె ఎవరికీ కనిపించలేదు. ఇక ఇటీవల కాలంలో యమున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా… సోషల్ మీడియా వేదిక ద్వారా తన సినిమా అనుభవాలు… తన అనుభవాలు పంచుకుంటుంది.
అలాగే అప్పటి సినిమా ముచ్చట్లు కూడా చెబుతోంది. ఈ క్రమంలోనే తనపై వచ్చిన వ్యభిచారం కేసు గురించి ఆమె క్లారిటీ ఇచ్చింది. బెంగళూరులో జరిగిన ఆ విషయంలో తన తప్పేమీ లేదని.. కావాలని తనపై కొందరు కుట్ర చేసి ఇరికించారని చెప్పింది. న్యాయస్థానం సైతం ఈ విషయంలో తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని.. తన తప్పేమీ లేదని చెప్పిందని అయినా కూడా కొందరు ఇప్పటికీ సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారు అంటూ వాపోయింది.
అసభ్యకరమైన తంబ్‌నైల్స్ తో మానసికంగా హింసిస్తున్నారని.. తాజాగా ఆమె ఓ వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేసింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో ? ఎప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పేసాను.. న్యాయస్థానం సైతం తన తప్పు లేదని చెప్పినా… సోషల్ మీడియా మాత్రం తనను పదేపదే గుచ్చి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత మోటివేట్ చేసుకుందాం అనుకున్నా .. తాను కూడా మనిషినే అని… ఒకవేళ తాను చనిపోయిన కూడా వీళ్లు నన్ను వదలరు అని తన బాధను ఆ వీడియోలో వ్యక్తం చేసింది.