సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలకు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు . ఒకప్పుడు టీవీలో కనిపించాలన్న ..పలు ఈవెంట్స్ కి వెళ్ళాలి అన్న ..స్టార్ సెలబ్రిటీసే వెళ్లేవారు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇంట్లో వంట చేసుకునే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీలుగా మారిపోయారు . తమలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ.. మేము సెలబ్రిటీస్ మంటూ సామాన్య జనాలు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి స్టార్ సెలబ్రిటీస్ అయినా మహిళలు సామాన్య జనాలు ఎంతో మంది ఉన్నారు .
కానీ యూట్యూబ్ లో ఎంతమంది ఉన్నా యూట్యూబర్స్ అనగానే మనకి టక్కున అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు షణ్ముఖ్ జస్వంత్.. ఆ తర్వాత దీప్తి సునయన ..ఆ తర్వాత అందరికీ గుర్తొచ్చేది గంగవ్వ. గంగవ్వ లాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయినా కానీ ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వలేకపోతున్నారు ..గంగవ్వ లాగా ఎదగలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటా అంటూ కూడా చర్చించుకుంటున్నారు . ఈ క్రమంలోనే గంగవ్వ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కష్టపడిందని .. తర్వాత ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అలాంటి టైం లోనే బిగ్ బాస్ లోకి ఆఫర్ రావడంతో..ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోయిందని జనాలు చెప్పుకొస్తున్నారు .
అంతే కాదు గంగవ్వ పలువురు స్టార్స్ ని కూడా ఇంటర్వ్యూ చేసింది . గంగవ్వకి ఇంగ్లీష్ రాకపోయినా సరే అంత పెద్ద స్టార్స్ ని కూడా ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఇప్పటికే గంగవ్వ తన పనులు తానే చేసుకుంటూ.. స్ట్రాంగ్ గా మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది . అంతేనా గంగవ్వ నెలకు 500000 పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కేవలం యూట్యూబ్ సంపాదనే .. అది కాకుండా ఈవెంట్స్ కి అటెండ్ అయిన.. ప్రమోషన్స్ కి వెళ్ళిన ఆమెకు మరికొన్ని కానుకలు బహుమతులు చెబుతున్నారు . ఈ విధంగా ఈ వయసులోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అంతేకాదు పలువురు స్టార్స్ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం..!!