సుజాత. క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చాలా మంది పరిచయం. వెంకటేష్-మీనా జంటగా నటించిన చంటి
సినిమాలో వెంకటేష్‌కు తల్లిపాత్రలో నటించిన సుజాత.. అప్పటి వరకు తెలియని వారికి కూడా పరిచ యం అయ్యారు. కానీ, వాస్తవానికి దీనికి ముందు ఆమె అనేక సినిమాల్లో సూపర్ స్ఠాయికి ఎదిగారు. తమిళ అగ్రశ్రేణి దర్శకుడు బాలచందర్ తీసిన అనేక సినిమాల్లో సుజాతకు ప్రత్యేక రోల్ ఉంది.
సుజాత మళయాళి. ఆమె స్వస్థలం కేరళలోని మరుదు. అయితే ఆమె పుట్టింది పెరిగిందా అంతా శ్రీలంకలోనే..! ఆమె మళయాళీ అయినా అనుకోకుండా.. ఆమె కెరీర్ అంతా కూడా..తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. బాలచందర్ పరిచయంతో కోలీవుడ్‌లో అగ్రశ్రేణికి ఎదిగారు. అయితే.. అదే బాలచందర్‌తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించారనే టాక్ ఉంది. దీంతో చాలా లేటు వయసులో ఆమె వివాహం చేసుకున్నారని కోలీవుడ్‌లో చర్చ ఉంది.
సుజాతది ప్రేమ వివాహం. ఆమె తన ఇంటి యజమాని కొడుకు హెన్రీ జయకర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే భర్తతో కలిసి అమెరికా వెళ్లిన ఆమెకు అక్కడ సంప్రదాయాలు నచ్చలేదు. దీంతో కాన్పు కోసం ఇండియాకు వచ్చిన ఆమె తిరిగి అమెరికాకు వెళ్లలేదు.
బాలచందర్ దర్శకత్వంలో సహ దర్శకురాలిగా కూడా సుజాత పనిచేశారు. సూత్రధారులు, అన్నమయ్య వంటి తెలుగు సినిమాల్లో నటించినా.. బాలచందర్ మనిషిగానే ఆమె గుర్తింపు పొందారు. తర్వాత కాలంలో కోలీవుడ్ బాలచందర్‌ను దూరం పెట్టిన తర్వాత.. సుజాత కెరీర్ కూడా మలుపు తిరిగి అవకాశాలు లేకుండా పోయాయని అంటారు. ఇక తెలుగులో దాసరి నారాయణ రావు లాంటి దర్శకులు ఆమెను బాగా ప్రోత్సహించారు.
అయితే.. సుజాతకు.. గతంలో ఉన్న వెలుగు ఆమె కెరీర్ చివర్లో లేదు. కెరీర్ చివర్లో ఆమె ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డారని ఇటీవల రాధిక ఓ సందర్భంలో పేర్కొన్నారు. మొత్తానికి సుజాత వర్సెస్ బాలచందర్.. కొన్నాళ్లు హిట్లు కొట్టినా.. తర్వాత కాలంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇదే..ఆమెకు మైనస్‌గా మారిందని అంటారు.