టైటిల్: దాస్ కా ధమ్కీ
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, అక్షర గౌడ, శౌర్యకరే, జబర్దస్త్ మహేష్
ఎడిటర్: అన్వర్ అలీ
మ్యూజిక్: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు
నిర్మాతలు: కరాటే రాజు
దర్శకత్వం: విశ్వక్ సేన్
రిలీజ్ డేట్: 22 మార్చి, 2023
టాలీవుడ్‌లో యంగ్ హీరో విశ్వక్‌సేన్‌కు యూత్‌లో మాంచి కిక్ ఇచ్చే క్రేజ్ అయితే ఉంది. తన బోల్డ్ యాట్యిట్యూడ్, హైదరాబాద్ స్లాగ్ లాంగ్వేజ్‌లో డైలాగులు చెపుతూ, అటు అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమా ఫ్రాంక్ వీడియోతో కాంట్రవర్సీ రేపడం.. ఇలా మాంచి పాపులర్ అయ్యాడు. తాజాగా విశ్వక్ స్వీయ దర్శకత్వంలో దాస్ కా ధమ్కీ సినిమా తెరకెక్కింది. హాట్ బ్యూటీ నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ? ఉందో TL సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
కృష్ణదాస్ ( విశ్వక్సేన్ ) ఓ అనాధ. తన స్నేహితులు అయిన ఆది ( హైపర్ ఆది ), మహేష్ ( రంగస్థలం మహేష్ ) తో కలిసి ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కీర్తి ( నివేద పేతురాజ్ ) ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపటానికి కోటీశ్వరుడిలా నటిస్తాడు. అయితే ఇదే టైంలో అచ్చం కృష్ణదాసు లాగానే ఉండే సంజయ్ రుద్ర ( విశ్వక్సేన్ ) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి క్యాన్సర్ పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టేందుకు తన బృందంతో కలిసి అనేక పరిశోధనలు చేస్తూ ఉంటాడు.
డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్ ( అజయ్ ) తో ఒక భారీ డీల్ కూడా కుదుర్చుకుంటాడు. ఈ నేపథ్యంలో సంజయ్ రుద్ర ప్లేస్‌లోకి కృష్ణదాస్ ఎంట్రీ ఇస్తాడు. తన అన్న కొడుకు సంజయ్‌లా నటించమని స్వయంగా అతడిని బాబాయ్ ( రావు రమేష్ ) కృష్ణదాస్ ని తీసుకువస్తాడు. అతడు అలా ఎందుకు చేసాడు ? సంజయ్ గా మారిన తర్వాత కృష్ణ దాస్ జీవితంలో ఎలాంటి ? మార్పులు చోటుచేసుకున్నాయి. డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు ? చివరకు ఈ రెండు పాత్రల మధ్య ఎలాంటి ? ట్విస్టులు జరిగాయి.. చివరకు కథ ఏమైందంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమాకు గత ఏడాది చివర్లో రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాకు కథ అందించిన బెజవాడ ప్రసన్నకుమార్ కథ ఇచ్చారు. పాత కథలనే కాస్త అటు ఇటుగా మార్చి కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి.. తన స్క్రీన్ ప్లే తో మాయ చేయటం ప్రసన్నకుమార్‌కు బాగా అలవాటు. ఆ మాటకు వస్తే ధమాకా సినిమాలోను కథ కొత్తగా ఉండదు. పాత కథకే కొత్త ట్రీట్మెంట్ ఇచ్చి మాయ చేసి పడేసాడు. ఇప్పుడు మాస్ కా ధమ్కీలోను అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.
ఒకరు ప్లేసులోకి మరొకరు రావడం… చివరలో వచ్చే ట్విస్టులు ఇవన్నీ ధమాకా, ఖిలాడీ సినిమాలతో పాటు గతంలో చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక ఈ సినిమాలో లాజిక్స్ గురించి అస్సలు మాట్లాడకూడదు. కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టేస్తాడు. అలా అని సినిమా అంతా మన ఊహకు అందేలా రొటీన్ గా నడుస్తుందని కూడా చెప్పలేం. కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని డైలాగులు బాగా పేలాయి. సినిమా ప్రధమార్ధంలో వచ్చే కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఆసక్తిగా సాగుతుంది.
కీర్తితో ప్రేమాయణం కాస్త రొటీన్ గానే అనిపించినా… మధ్య మధ్యలో వేసే పంచ్‌లతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ అంతా కంటిన్యూగా ట్విస్టులతో ప్లాన్ చేశారు. వాటిలో కొన్ని ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తే.. మరికొన్ని మాత్రం కాస్త బోరింగ్ అనిపిస్తాయి. కొన్ని ట్విస్టులలో ముందే ఏం జరుగుతుందో ? ప్రేక్షకుడు ఊహించేయవచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కాకుండా.. కాస్త కామెడీ ఉంటే చాలు… విశ్వక్‌సేన్‌ను చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
నటీనటుల పెర్పామెన్స్ :
నటీనటుల్లో విశ్వక్‌సేన్ రెండు షేడ్స్‌లోనూ సాలిడ్ పెర్పామెన్స్‌తో అదరగొట్టేశాడు. ఇలాంటి యూత్‌ఫుల్ రోల్స్‌లో చాలా అగ్రెసివ్‌గా కనిపించిన విశ్వక్ చైర్మన్ రోల్లో సెటిల్డ్ పెర్పామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ నివేద గత తెలుగు సినిమాల్లో చాలా సెటిల్డ్‌గా కనిపించింది. అయితే ఈ సినిమాలో మాంచి గ్లామర్ షోతో మాస్ ఆడియెన్స్‌కు మాంచి ట్రీట్ ఇచ్చింది. ఆమె విశ్వక్ మధ్య బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది.
ఇక సినిమాలో ఎంటర్టైన్‌మెంట్ హైలెట్. ఎంటర్టైన్‌మెంట్ కోరుకునే వాళ్లకు ఈ ధమ్కీ మాంచి ట్రిట్ ఇచ్చింది. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లతో విశ్వక్ ల పలు కామెడీ సీన్లు చాలా హిలేరియస్ గా ఉంటాయి. అలాగే రావు రమేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారనే చెప్పాలి.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్‌గా సినిమా నిర్మాణ విలువలు చాలా రీచ్‌గా ఉన్నాయి. అన్ని హంగులు కనిపిస్తాయి. లియోన్ జేమ్స్ సంగీతం మంచి ఫీల్ ఇస్తుంది. అలాగే దినేష్ కే బాబు సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సెకండాఫ్‌లో ఓవర్‌గా ఉన్న ట్విస్టులతో పాటు కొన్ని బోరింగ్ సీన్లు కట్ చేస్తే ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉండేది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విశ్వక్‌సేన్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో తన పనితనం చూపించలేదు. సెకండాఫ్‌లో ఇంకాస్త బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది. ట్విస్టులు చాలా వరకు ముందే తెలిసిపోయేలా ఉన్నాయి. విశ్వక్ చాలా వరకు ఎఫర్ట్ పెట్టినా డైరెక్టర్‌గా అంత మెప్పించలేదు.
ఫైనల్‌గా…
ఓవరాల్‌గా చూస్తే ఈ దాస్ కా ధమ్కీలో విశ్వక్‌సేన్, నివేదా పేతురాజ్ గ్లామర్ షో. వాళ్లిద్దరి కోసం.. కాస్త ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు విశ్వక్ వన్ మ్యాన్ షో ఎంజాయ్ చేసేవాళ్లకు బాగా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేకపోవడం.. సెకండాఫ్‌లో బోరింగ్ ట్విస్టులు ఉంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటే ఓ సారి చూసి రావొచ్చు.
ఫైనల్ పంచ్: ఈ మాస్ కా దాస్ విశ్వక్ సింగిల్ పంచ్
దాస్ కా ధమ్కీ రేటింగ్ : 2.5 / 5