ఆంధ్రుల సోగ్గాడు.. అందాల నటుడు శోభన్‌బాబుకు సినీ ఇండస్ట్రీలో డిసిప్లిన్ పాటిస్తారనే పేరుంది. ఆయనంత క్రమశిక్షణ మరో హీరో ఎవరికీ లేదు. సినిమా షూటింగులకు రావడం నుంచి రెమ్యుననరేషన్ తీసుకునే వరకు.. అంతా కూడా పక్కాగా జరగాలని కోరుకునే హీరోల్లో.. శోభన్‌బాబు ముందుంటారు. ఆయనంటే.. నిర్మాతలకు కూడా అంతే గౌరవం. సాయంత్రం ఆరు గంటలు కాగానే.. ఇతర హీరోలు వేరే వేరే చోట్లకు వెళ్లేవారు.
కానీ, శోభన్‌బాబు మాత్రం షూటింగ్ స్పాట్ నుంచి నేరుగా ఇంటికివెళ్లేవారు. తనను ఎవరైనా అభిమానులు చూసేందుకు వస్తే.. సాయంత్రం 7-8 మధ్య మాత్రమే కలిసేవారు. అది కూడా. వారిని రావొద్దని సలహా ఇచ్చేవారు. ఇంతింత ఖర్చులు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? అని నచ్చజెప్పేవారు. తన ఇంట్లో తనతోనే వారికి భోజనం పెట్టి.. బట్టలు పెట్టి పంపించేవారు. తప్ప.. డబ్బులు ఇచ్చేవారు కాదు. అదే కృష్ణ అయితే.. ఎవరు అడిగినా.. చందాలు ఇచ్చేవారు.
ఇక, శోభన్‌బాబు తరంలోనే మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, వంటివారు ఉన్నా.. కూడా వీరికి అంత క్రమశిక్షణ రాలేదు. వీరంతా కూడా.. శోభన్‌బాబుకుఅత్యంత ఆప్తమిత్రులు. తరచుగావీరు కలిసి పార్టీలు చేసుకునేవారు. శోబన్‌బాబు మాత్రం.. టీగ్లాస్ తప్ప.. ఇతర గ్లాసులు ముట్టుకునేవారు కాదట. ఆరోగ్యం విషయంలోనూ ఆయన అంతే డిసిప్లిన్ పాటించేవారు. ఇక,హీరోయిన్ల ప్రస్తావనను అసలు పట్టించుకునేవారుకాదట. ఇదే ఆయనను అగ్రస్థానంపై కూర్చోబెట్టింది.
అయినా..కూడా కొన్ని కొన్ని రూమర్లు వ్యాపించాయి. అయినా.. వాటికిసమాధానం ఇచ్చేవారు కాదు. ఇదే విషయాన్ని కృష్ణ ప్రస్తావించారు. నీ గురించి.. ఓ పత్రికలో రాశారు.. కాదని చెప్పకపోయావా? అని సలహా ఇచ్చారట. దీనికి శోభన్‌బాబు నవ్వి.. నేను కాదని చెప్పినా.. రాసేవారు రాస్తారు. నేను స్పందిస్తే.. మరిన్ని రాస్తారు. సైలెంట్‌గా ఉంటే.. అక్కడితో పోతుంది! అని చెప్పేవారు. ఈ సూత్రాన్ని చాలా మంది పాటించారు. ఎక్కువ మంది తమపై వచ్చిన రూమర్లపై స్పందించేవారు కాదు. ఇదీ.. శోభన్‌బాబు స్టయిల్.