సినీరంగంలో హీరోయిన్ల మధ్య గొడవలు, ఇగోలు మామూలుగా నడుస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో పూజా హెగ్డే – సమంత మధ్య సోషల్ మీడియా వేదికగా సెటైర్లతో పెద్ద యుద్ధం జరిగింది. చివరకు ఇద్దరు హీరోయిన్ల అభిమానులు బయటకు వస్తే నిజంగానే కొట్టుకునేంత మాటలతూటాలు పేలాయి. పూజాహెగ్డేకు సమంతకు ఎంతో కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ తర్వాత రష్మిక అభిమానులు పూజహెగ్డే అభిమానులు సోషల్ మీడియాలో కొట్టేసుకున్నారు.
ఇప్పుడు ఉన్నది అంతా సోషల్ మీడియా యుగం కావడంతో యుద్ధం అంతా ఆన్లైన్ లోనే నడుస్తోంది.
ఒకప్పుడు ఇలాంటి సామాజిక మధ్యమాలు లేవు. హీరోయిన్ల మధ్య ఏదైనా గొడవలు ఉంటే కొన్ని సినిమా పత్రికలలో మాత్రమే అవి వచ్చేవి. 1970వ దశంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు జయసుధ, జయచిత్ర. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా కటకటాల రుద్రయ్య సినిమా వచ్చింది.
ఈ సినిమాలో వీరిద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తున్న కాకర్ల రాజేంద్రప్రసాద్ తో అప్పటికే జయసుధ ప్రేమలో ఉంది. రాజేంద్రప్రసాద్ జయసదకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరకు జయసుధ వేసుకునే కాస్ట్యూమ్స్, స్లిప్సర్ ఇలా అన్నీ చాలా ఖరీదైనవి ఇచ్చారు. అలాగే జయచిత్రకు చాలా తక్కువ రకానికి చెందిన కాస్ట్యూమ్స్ ఇచ్చారు. దీంతో జయచిత్ర దాసరి దగ్గర కంప్లైంట్ చేయడంతో పాటు రాజేంద్రప్రసాద్ – జయసుధ మధ్య నడుస్తున్న వ్యవహారాన్ని కూడా బట్టబయలు చేసిందట.
దీంతో జయసుధ కోపం నషాళానికి ఎక్కేసింది. ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా జయసుధ.. జయచిత్ర ఇద్దరూ కొట్టుకునే సీన్ ఉందట. అయితే అప్పటికే వీరి మధ్య రగిలిపోతున్న పగ ఉంది. దీంతో వారిద్దరూ నిజంగానే ఒకరిని ఒకరు గట్టిగా కొట్టేసుకున్నారట. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయిపోయి వాళ్లను విడదీశారట. ఏమ్మా ఎంటి నిజంగానే కొట్టుకుంటున్నారు అని సర్ది చెప్పారట.
పక్కనే ఉన్న దాసరి కూడా షాక్ అయిపోయి వారిపై కోప్పడ్డారట. కేవలం వారిద్దరికీ అంతకుముందు నడుస్తున్న ఆ గొడవల కారణంగానే నిజంగానే ఆ సీన్లో వారిద్దరూ గట్టిగా కొట్టుకునే వరకు వచ్చేసింది. ఆ తర్వాత దాసరి సర్ది చెప్పి ఆ సినిమా షూటింగును ముగించారు. ఆ తర్వాత చాలా రోజులపాటు జయసుధకు, జయచిత్రకు మధ్య సఖ్యత లేదని అంటారు.