ఎవడైనా ఒకడు పైకి ఎదుగుతున్నాడు అంటే వాడిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. వాడి కాళ్లకు పట్టుకుని కిందకు లాగేయడంలో కొందరు ముందు ఉంటారు. వాళ్లకు అవతలి వాడు ఎదుగుదల ఇష్టం ఉండదు.. ఆ కడుపు ఉబ్బరాన్ని తట్టుకోలేక మీడియా, సోషల్ మీడియాలో బురద జల్లుతూ ఉంటారు. బాహుబలి సినిమాతో తెలుగుజాతి ఖ్యాతిని ఎల్లలు దాటించేసిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి మన తెలుగు సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకువెళ్లాడు.
అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలవడాన్ని ఏ మాత్రం ఇష్టంలేని ఓ తెలుగు ప్రముఖ వెబ్సైట్ ఆ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే బుదర జల్లుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ప్లాప్ అని.. రాజమౌళిని అందరూ గుడ్డిగా నమ్మి మోసపోయారంటూనే కేవలం 2.5 రేటింగ్ ఇచ్చి తన పైత్యాన్ని ప్రదర్శించింది. అక్కడ నుంచి ఈ రోజుకు కూడా త్రిబుల్ ఆర్‌పై విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదు.
ఆ సినిమాను కేజీయఫ్ 2తో పోల్చి చూస్తే తక్కువ చేసే ప్రయత్నం చేయడం… ఏరియాల వారీగా సినిమా కొనుక్కున్న ఉన్న వాళ్లకు నష్టాలు వచ్చాయని కూతలు కూయడం జరిగింది. ఇక తాజాగా ఈ సినిమా ఆస్కార్‌కు వెళ్లడంతో రాజమౌళి హాలీవుడ్ మీడియా వాళ్లతో బేరాలు మాట్లాడుకుని వార్తలు రాయించుకున్నాడంటూ ఇలా ఏవేవో చెత్త వార్తలు రాస్తోంది.
ఈ భారమంతా నిర్మాతలే మీదే పడుతుందని.. ఇందుకోసం ఏకంగా రు. 70-80 కోట్లు ఖర్చవుతోందని కూడా రాసుకు వస్తోంది. అసలు త్రిబుల్ ఆర్ సినిమా గురించి చెపితే చాలు ఆ టాప్ సైట్‌కు మంట పుట్టేస్తోన్నట్టుగా ఉంది. అందుకే ఇష్టమొచ్చిన రాతలు రాస్తూ.. పిచ్చి కూతలు కూస్తోంది. మన తెలుగోడు సాధించిన విజయ గర్వాన్ని ముచ్చుకోవాల్సింది పోయి కుష్టు రాతలతో ఆనంద పడుతోంది. కేవలం రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, చెర్రీ సాధించిన విజయం ఆ సైట్‌కు ఇష్టం లేనట్టుగానే వాళ్ల రాతలే చెపుతున్నాయి.