టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముకుంద సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ..ఆ తర్వాత బోలెడు సినిమాలో నటించింది . అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది . అయినా కానీ ఏ మాత్రం నిరుత్సాహపడకుండా .. పూజా హెగ్డే తన సినిమాలను చూస్ చేసుకుంటూ వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలలో నటించింది .
ఈ క్రమంలోని ఫైనల్లీ ఎట్టకేలకు తారక్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది. ఇక తర్వాత పూజ హెగ్డే కెరీర్ అమాంతం టర్న్ అయింది . ఏది పట్టుకున్న బంగారమే అన్న విధంగా ఆమె చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది . మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది . ఈ క్రమంలోని ఐరన్ లెగ్ నుంచి ఒకసారిగా టాలీవుడ్ అదృష్ట దేవతగా మారిపోయింది పూజా హెగ్డే . ఈ క్రమంలోనే పూజ హెగ్డే కొంచెం హెడ్ వెయిట్ పెరిగింది అన్న కామెంట్స్ లో వినిపించాయి. కేవలం స్టార్ హీరోలకి కాల్ షీట్స్ ఇవ్వడం కుర్ర హీరోలకి ఇవ్వకుండా డైరెక్టర్ లను ఇన్సల్ట్ చేయడం ..అంతేకాకుండా రెమ్యూనరేషన్ ఆమె అడిగినంత ఇవ్వాలి అని పోర్స్ చేయడం ఆమెకు నెగిటివ్ మార్కింగ్ గా మారాయి .
ఈ క్రమంలోనే పలువురు స్టార్ డైరెక్టర్ లు పూజ హెగ్డే తో సినిమా వద్దు అంటూ ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టారు . దీంతో పూజ హెగ్డే వచ్చిన ఆఫర్స్ తో సరిపెట్టుకునింది . ఈ క్రమంలోనే అమ్మడు టైం.. అదృష్టం బాగోలేదో.. ఆమె పెద్దపెద్ద హీరోలతో చేసిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి , ఆశ్చర్యం ఏంటంటే డిజాస్టర్ అందుకున్న హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో మరో సినిమాకి కమిట్ అయ్యారు. కానీ పూజ హెగ్డే మాత్రం ఆ డిజాస్టర్ టాక్ అలాగే పెట్టేసుకుంది.
ఈ క్రమంలోని పూజా హెగ్డే కెరియర్ బాగున్నప్పుడు కుర్రాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే ఇలాంటి కష్ట సమయంలో యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోస్ పూజ హెగ్డే కు ఛాన్స్ ఇచ్చే వాళ్లని.. ఆ విధంగా పూజ హెగ్డే తన కెరీయర్ని తానే నాశనం చేసుకుంది అంటున్నారు ఫాన్స్ . అంతేకాదు మరీ ముఖ్యంగా బాలీవుడ్ కి ప్రయారిటీ ఇవ్వడం పూజాకు మరింత మైనస్ గా మారింది . చూద్దాం పూజ హెగ్డే ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుందో..?