ఒకప్పటి సీనియర్ నటుడు పద్మనాభం తెలుగు సినీ ప్రేక్షకులను ఎన్నో సినిమాలతో నవ్వించాడు. పద్మనాభంను తెరమీద చూస్తేనే కావాల్సినంత కామెడీ పండేది. ఎంతో వెలుగు వెలిగిన ఆయన తాను చేసిన తప్పుల వల్లే బలైపోయాడు. ఆయన కెరీర్ ఆయనే చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఇక పద్మనాభం కడప జిల్లాలోని పులివెందుల తాలూకి సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు. తల్లి శాంతమ్మ కాగా.. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య.
ఆయన తండ్రి వేంపల్లెకి సమీపంలో ఉన్న వీరన్నగట్టుపల్లెకు కరణంగా ఉండేవారు. తాతయ్య సుబ్బయ్య కూడా ఈ గ్రామానికి కరణమే. చిన్నప్పటి నుంచే పద్మనాభానికి సంగీతం అన్నా, పాటలు అన్నా, పద్యాలు అన్నా మహా ఇష్టం. మూడో యేట నుంచే పద్యాలు పాడే ప్రయత్నం చేసేవాడు. ఈ ఊరి టెంట్ హాల్‌లో ద్రౌపదీ వస్త్రాపరహరణం, వందేమాతరం, సుమంగళి, శోభనావారి భక్త ప్రహ్లాద లాంటి సినిమాలు చూస్తూ అందులో పద్యాలు, హస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవాడు.
నటనపై ఆసక్తితో రైలెక్కేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా మద్రాస్ వెళ్లిన పద్మనాభం నటి కన్నాంబ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత విజయా సంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన గతిని మార్చేసింది. పద్మనాభం నటుడిగా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో.. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన అంతే త్వరగా పతనం అయిపోయారు. ఆయన కెరీర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడే అమ్మాయిల పిచ్చి ఉండేదని అంటారు.
సీనియర్ సినిమా ఎనలిస్టు వాసిరాజు ప్రకాశం ఓ ఇంటర్వ్యూలో పద్మనాభంకు ముగ్గురు భార్యలు ఉండేవారని.. ఆయన ఏకకాలంలో ఆ ముగ్గురిని మూడు ఇళ్లలో మెయింటైన్ చేసేవారని చెప్పారు. అలా క్రమశిక్షణ ఎప్పుడు అయితే పోయిందో ఆయన పతనానికి అదే నాంది అయ్యిందని చెప్పారు. పద్మనాభంతో తనకు అనుబంధం ఉండేదని.. 1964 ఆ టైంలో పద్మనాభంకు వరుసగా అవకాశాలు వచ్చి మంచి పేరు, డబ్బు సంపాదించినా ఆయన వ్యక్తిగత తప్పిదాల వల్ల అవన్నీ పోయాయని చెప్పారు.
ముందు పద్మనాభం ఒక ఇంట్లో ఒక భార్యను పెట్టాడని.. తర్వాత మరో ఇళ్లు తీసుకుని.. రెండో భార్యను పెట్టడం.. ఆ తర్వాత మూడో భార్య కూడా పద్మనాభం జీవితంలోకి ఎంటర్ కావడం జరిగాయని ప్రకాశం చెప్పారు. ఆ ముగ్గురు భార్యలు, వాళ్ల పిల్లలు అదో ప్రపంచంగా ఉండేదని.. పద్మనాభంకే క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన కొడుకుకు కూడా క్రమశిక్షణ లేదని.. కొడుకు అయితే మద్యానికి బానిస అయ్యి.. ఎవరిని పడితే వాళ్లను డబ్బులు అడిగి మరీ తాగేసేవాడని కూడా ఆయన తెలిపారు. ఏదేమైనా పద్మనాభం ఆ తప్పులు చేయకపోతే కెరీర్ మరికొన్నాళ్లు సక్సెస్ ఫుల్‌గా కొనసాగేదని కూడా ఆయనతో అనుబంధం ఉన్న ప్రకాశం చెప్పారు.