అదేంటి అనుకుంటున్నారా? ఔను.. 2 దశాబ్దాల కిందటి టాలీవుడ్ సంగతులను నెమరు వేసుకుంటే.. బాల య్య-విజయశాంతిల గురించి పుంఖాను పుంఖాలుగా గ్యాసిప్లు పెద్ద ఎత్తున హల్చల్ చేసేవి. దీనికి కార ణం.. విజయశాంతి-బాలయ్యల మధ్య కెమిస్ట్రీ బాగుండేదని అనేవారు. ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలు హిట్ కొట్టడంతోపాటు.. పాటల నుంచి యాక్షన్ వరకు కూడా.. ఇద్దరి మధ్య ఒక అనుబంధం పెరిగిందనే టాక్ ఉండేది
అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్లో బాలయ్య సుహాసిని, రజనీ లాంటి హీరోయిన్లతో ఎక్కువుగా చేశారు. ఆ తర్వాత విజయశాంతితో బాలయ్య సినిమాలు చేయడం మొదలు పెట్టాక అసలు వీరిద్దరి కాంబినేషన్ అంటే నాటి ఆంధ్రదేశం పిచ్చెక్కిపోయేది. ఎన్నో సూపర్ హిట్లు పడ్డాయి. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన సినిమా నిప్పురవ్వ.
ఇక బాలయ్యను.. విజయశాంతి.. సీఎం గారబ్బాయ్
.. అని పిలిచేవారట. ఇక, విజయశాంతిని బాలయ్య.. శాంతి.. శాంతి..
అని షూటింగుల సమయంలో చాలా చనువుగా పిలిచేవారని.. పుంఖాను పుంఖాలుగా గ్యాసిప్లు వచ్చేవి. అంతేకాదు.. సినిమా షూటింగుల పేరుతో ఊటీ.. తదితర లాంట్ టూర్లు పెట్టుకుని ఇద్దరూ ఎంజాయ్ చేసేవారని రాసుకొచ్చేవారు. ఇక, టాలీవుడ్లో వీరిని ఎంకరేజ్ చేసిన దర్శకులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఎందుకో కారణం అయితే తెలియదు కానీ.. బాలయ్య అప్పటి సీఎం అన్నగారి కుమారుడనే భావనతోనో.. ఏమో.. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న యాక్సస్ అంతా ఇంతా ఉండేది కాదు. ఇక, విజయశాంతి కూడా అంతే రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి మధ్య ఏముందో తెలియదు కానీ.. విజయశాంతి – బాలయ్యల మధ్య మాత్రం కెమిస్ట్రీపై అనేక కథనాలు మాత్రం గ్యాసిప్లుగా హల్చల్ చేసేవి.