హైదరాబాద్ రోజు రోజుకు విశ్వనగరంగా దూసుకుపోతోంది. దేశంలోనే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత ఆ రేంజ్ అప్లాజ్ హైదరాబాద్‌కే వస్తోంది. యేటా యేటా కోట్లాది రూపాయల పెట్టుబడులతో వందలాది కంపెనీలు వెలుస్తున్నాయి. దీంతో ఇప్పుడు హైదరాబాద్ నార్త్, సౌత్ ప్రజల సంస్కృతి సమ్మేళనం అయిపోయింది. అసలు ఇప్పుడు హైదరాబాద్ విస్తరణ ఏ రేంజ్‌లో ఉందంటే… హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇటు వైపు భువనగిరి సమీపంలో.. అటు పక్క జహీరాబాద్ అవుట్ కట్స్‌లో నడుస్తోంది.
దీనిని బట్టే హైదరాబాద్ విస్తరణ ఎలా ఉందో తెలుస్తోంది. ఇక పెరిగిన జనాభా వినోదానికి అనుగుణంగా ప్రతి యేటా కొత్త మల్టీఫ్లెక్స్‌లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు మణికిరీటంలా ఉన్న ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పుడు మరో కొత్త ఆకర్షణ తోడు అవుతోంది. నాలుగున్నర ఎకరాల ప్లేస్‌లో ఓ మాంచి డ్రైవ్ ఇన్ థియేటర్ రెడీ అవుతోంది.
ఈ మేరకు టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోలు జీఎమ్మార్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఓపెన్ థియేటర్ పేరు ఏఎంబీ క్లాసిక్. ఆసియన్ సంస్థ సునీల్‌తో పాటు టాలీవుడ్ హీరోలు మహేష్‌బాబు – వెంకీ – రానా కలిసి సంయుక్తంగా ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను నిర్మించబోతున్నారు. ఇందులో చిన్న సిట్టింగ్ ఎన్‌క్లోజర్ కూడా ఉంటుంది. అలాగే ఓ ఫుడ్ కోర్టు కూడా నిర్మిస్తున్నారు.
ఇది హైదరాబాద్‌తో పాటు ఎయిర్ పోర్టుకే స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. మహేష్‌బాబు – ఏసియన్ వాళ్లు కలిపి కట్టిన ఏఎంబీ మాల్‌ను డిజైన్ చేసిన ముంబైకే చెందిన ఆర్కిటెక్ట్‌నే ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను కూడా డిజైన్ చేస్తున్నారు. ఈ యేడాది దసరాకు ఈ థియేటర్ అందుబాటులోకి రానుంది. ఏదేమైనా హైదరాబాద్‌లో మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లు సరికొత్త పుంతలు తొక్కుకుంటూ పోతున్నాయి. మరో రెండు, మూడేళ్లలో మరిన్ని మార్పులు చూడబోతున్నాం..!