సినిమా రంగంలో హీరోయిన్లకు లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 60 ఏళ్లు దాటి 70 సంవత్సరాలు వచ్చిన నటిస్తూనే ఉంటారు. రజినీకాంత్ వయసు ఇప్పటికే 70కి చేరువయ్యింది. మెగాస్టార్ చిరంజీవి వయసు కూడా మరో రెండు మూడేళ్లలో 70కు చేరుకుంటుంది. ఇప్పటికి వీళ్లంతా స్టార్ హీరోలుగా కొనసాగుతూనే వస్తున్నారు. అయితే హీరోయిన్లకు కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత గొప్ప హీరోయిన్ అయినా ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటే చాలా కెరీర్ ముగిసిపోతుంది.
ఆ తర్వాత వాళ్లు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోతూ ఉంటారు. కొందరు అయితే కెరీర్ ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ట్రెండ్ మారింది.. కొందరు హీరోయిన్లు 35 సంవత్సరాలు దాటుతున్న ఇంకా పెళ్లి అన్న మాటే అనటం లేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకటం లేదు. దీంతో ముదురు ముద్ద గుమ్మలకు ఇప్పుడు సీనియర్ హీరోలు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. కెరీర్ ఎలాగూ కొనసాగుతోంది కదా అన్న ఆలోచనతో ముదురు హీరోయిన్లు పెళ్లిమాట మరిచిపోయి ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు. ఈ లిస్టులో ఉన్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
అనుష్క:
అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది అనుష్క. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా పదేళ్లపాటు ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు అనుష్క వయసు 41 సంవత్సరాలు.. ఇంకా ఆమె పెళ్లి మాటే ఎత్తటం లేదు. ఎప్పటికప్పుడు ప్రభాస్‌తో ఆమె పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నా అవి ఏవి జరగటం లేదు. తాజాగా అనుష్క నవీన్ పోలిశెట్టి లాంటి కుర్ర హీరోతో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా ఆమెకు సీనియర్ హీరోలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు అనుష్క పెళ్లి చేసుకుంటుందా? ఇప్పటిలో ఆమె పెళ్లి జరుగుతుందా.. అన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.
త్రిష:
చెన్నై చిన్నది త్రిష 2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె తొలి సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత పదేళ్లపాటు త్రిష టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. అసలు త్రిష తెలుగు తమిళ భాషలో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించింది.
తెలుగులో దగ్గుబాటి హీరో రానా తమిళంలో ఇద్దరు ముగ్గురు హీరోలతో కూడా ఆమె ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ కు జోడిగా లియో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం త్రిష వయసు 39 సంవత్సరాలు.. ఇప్పటికీ ఆమె పెళ్లి అన్న మాటే అనటం లేదు. పారిశ్రామికవేత్త వరుణ్ మనియణ్‌తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా పెళ్లి క్యాన్సిల్ అయింది.
ఇలియానా:
దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సన్న నడుము సుందరి ఇలియానా గోవా సుందరి. ఇలియానా తెలుగులో ఒక ఊపు ఊపేసి స్టార్ హీరోలు అందరితో నటించింది. 36 ఏళ్ళు దాటుతున్న ఇప్పటికీ ప్రేమలు.. డేటింగ్ అంటుంది.. తప్ప పెళ్లి వూసే ఎత్తటం లేదు. ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ఆమె డేటింగ్ చేసి తర్వాత బ్రేకప్ చెప్పేసింది.
రకుల్ ప్రీత్ సింగ్:
పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ అందరితోనూ చకచకా సినిమాలు చేసేసింది. అయితే అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం 34 ఏళ్ళు వచ్చిన రకుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి రెడీ అవుతుంది.
నిత్యా మీనన్:
మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తెలుగులో ఇంకా వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ కి జోడిగా భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. 34 ఏళ్లు దాటుతున్న నిత్య ఇంకా పెళ్లి వూసే ఎత్తటం లేదు.
కృతికర్బందా:
పవన్ కళ్యాణ్ తో తీన్మార్ సినిమాలో నటించిన కృతికర్బందా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీ కృతి పెళ్లి చేసుకోలేదు. అలాగే పాలబుగ్గల సుందరి తమన్నా కూడా 36 ఏళ్లు దాటుతున్నా అసలు పెళ్లి మాటే ఎత్తటం లేదు. తమన్నాకు తెలుగులో సీనియర్ హీరోలు వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండడంతో.. ఆమె ఎంచక్కా సినిమాలు చేసుకుంటుంది. పెళ్లి అన్న మాట మర్చిపోయింది.
ఇక తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా వయసు 33 సంవత్సరాలు. అలాగే కమలహాసన్ కుమార్తె శృతిహాసన్ 38 ఏళ్లు దాటుతున్న డేటింగులు.. బ్రేకప్ లు… ప్రేమలు అంటూ తిరుగుతోంది తప్ప పెళ్లి ఊసే ఎత్తటం లేదు. అలాగే తెలుగు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ వయసు కూడా 35 దాటుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మరో నార్త్ ఇండియన్ హీరోయిన్ తాప్సీ వయసు 35 క్రాస్ అవుతుంది.. ఆమె కూడా ఇంకా బ్యాచిలర్ గానే ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పూజా హెగ్డే వయసు 31 సంవత్సరాలు.
విచిత్రం ఏమిటంటే పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అమీషా పటేల్ వయసు 46 ఏళ్ళు దాటినా ఎప్పటికీ హాట్ హాట్ పోజులతో మతులు పోగొడుతుంది. అమీషా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉంది. అలాగే మరో సీనియర్ నటి టబు వయసు 55 సంవత్సరాలకు దగ్గరలో ఉంది. ఆమె కూడా ఇప్పటికీ సింగిల్గానే ఉంది. మరి ఈ ముదురు ముద్దుగుమ్మలు ఇంకా ఎప్పుడు ? పెళ్లి చేసుకుంటారో ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారో ? కాలమే నిర్ణయించాలి.