జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్కో సినిమాకు రు. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల మనిషి.. నిర్మాతల శ్రేయస్సు కోసం ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేందుకు ఇష్టపడేవాడు కాదు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు. 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునేవాడు.
వరుసగా ఐదు సూపర్ డూపర్ హిట్లు పడడంతో పాటు.. త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కాస్త పెరిగింది. త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు పాటు పనిచేశాడు. దీంతో రాజమౌళి నిర్మాత దానయ్యకు చెప్పి ఎన్టీఆర్‌కు రు. 45 కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పించాడు. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమా కోసం.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఈ రెండు సినిమాకు సినిమాలకు గాను ఒక్కో సినిమాకు ఎన్టీఆర్‌కు రు. 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ముట్టబోతుందట. ఆ తర్వాత సినిమాకు భారీ లాభాలు వస్తే.. అందులో ఐదు శాతం వాటా కూడా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. ఇక గత 7 – 8 సంవత్సరాల లోనే జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులు విలువ బాగా పెరిగినట్టు తెలుస్తోంది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎన్టీఆర్ చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేశారని.. హైదరాబాద్ చుట్టుపక్కల అమరావతితో పాటు, వైజాగ్ సమీప ప్రాంతాల్లో భూములపై ఎన్టీఆర్ ఎక్కువగా పెట్టుబడులు పెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోవడం ద్వారా వైట్ మనీ.. అది కూడా కేవలం లిక్విడ్ క్యాష్ రు. 500 కోట్లకు పైగా ముట్టిందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు హైదరాబాదులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్లకు కోట్లలోని ఆస్తులు ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత ఆస్తులు విలువ స్థిర, చరాస్తులు కలుపుకుంటే వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గత మూడు, నాలుగేళ్లలో ఎన్టీఆర్ సినిమాలు చేయకపోయినా.. ఒక్క త్రిబుల్ ఆర్ సినిమా మాత్రమే చేశాడు.
అయినా కూడా ఎన్టీఆర్ నెలవారి ఆదాయం మూడు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని భోగొట్టా..! ఇక సినిమాలు చేసినప్పుడు ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ కు స్థిర, చరాస్తులతో పాటు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అటు లక్ష్మీ ప్రణతికి వచ్చిన కట్నం ద్వారా కూడా ఎన్టీఆర్‌కు నెలవారి ఆదాయం గట్టిగానే వస్తుందట. ఆమెకు వచ్చిన ఆస్తులు విలువ కూడా గత 10 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ కలుపుకుంటే ఎన్టీఆర్ ఆస్తులు కోట్లలోనే ఉంటాయనటంలో సందేహం లేదు.