మహానటి సావిత్రి.. తన కెరీర్‌ను మలిచిన జెమినీ గణేష్‌ను వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలి సిందే. అయితే.. సావిత్రి జీవితంలో జెమినీ గణేష్ కంటేముందుగానే ఒక వ్యక్తి ప్రవేశించిన విషయం చాలా చాలా తక్కువ మందికి తెలుసునని.. గుమ్మడి రాసుకున్న తీపిగురుతులు.. చేదు జ్ఞాపకాలు పుస్తకంలో వివరించారు. ఈ విషయం సావిత్రి కుటుంబంలోనూ తెలుసునని ఆయన పేర్కొన్నారు.
సావిత్రికి తెలుగు వారి కంటే కూడా.. తమిళనాడు వాసులతో ఎక్కువగా అనుబంధం ఉండేది. తమిళ నటీనటులు.. సావిత్రిని చూసి నేర్చుకునేందుకు వచ్చేవారు. తమ షూటింగులు అయిపోగానే.. సావిత్రిని వెతుక్కుంటూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలానే పిళ్లయ్ అనే దర్శకుడు కూడా సావిత్రిని వెంబడించాడు. ఆమె ఎక్కడుంటే.. అక్కడకు వచ్చేసేవాడు.
అని గుమ్మడి రాసుకున్నారు.
పిళ్లయ్ కూడా అనేక చిత్రాలు తీసి.. పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడేనని గుమ్మడివివరించారు. అయినప్పటికీ.. సావిత్రి అభినయం చూసేందుకు ఇలా తన షూటింగ్‌లను ముందుగానే ముగించుకుని.. ఆమె ఉన్న చోటుకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే సావిత్రితో ఆయనకు పరిచయం ఏర్పడింది. పాపం సావిత్రి.. అప్పటికే ప్రేమలో ఉంది. ఈ విషయం తెలియని పిళ్లయి.. తమిళంలోనే ఆమెకు ప్రెపోజ్ చేశాడు.
పైగా.. గుమ్మడికి స్నేహితుడు కూడా కావడంతో ఆయన ద్వారా సావిత్రికి ఏదో రాయబారం పంపించాలని అనుకున్నాడు. పెళ్లిచేసుకుంటాను.. కొంచెం చెప్పు
అని తనను కోరినట్టు పిళ్లయ్ గురించి రాసుకొ చ్చారు గుమ్మడి. అయితే, అప్పటికే ఆమె ప్రేమలో ఉందని.. జెమినీ గణేష్ ఆమె.. పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పుడు నీగురించి చెప్పడం బాగోదని గుమ్మడి సర్ది చెప్పారట. దీంతో పిళ్లయ్ ఏకంగా.. సినిమాలు మానేసి.. తన ఊరు వెళ్లిపోయారని గుమ్మడి చెప్పుకొచ్చారు. ఇదీ.. సంగతి..!